Breaking News

సంతానాన్ని కాపాడుకున్నట్లే మొక్కలు కాపాడుకోవాలి

బాన్సువాడ, జూన్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన సంతానాన్ని కాపాడుకున్నట్లే మొక్కల‌ను కాపాడుకోవాల‌ని రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. సోమవారం ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా గాంధారి ఎక్స్‌ రోడ్‌ పద్మాజివాడి నుండి బాన్సువాడ వరకు 45 కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా మూడు వరుసలో 40 వేల‌ మొక్కలు నాటే కార్యక్రమంలో శాసనసభాపతి ముఖ్యఅతిథిగా పాల్గొని మొక్కలు నాటినీరుపోశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, భూమి పంచభూతాల‌ను కాపాడుకోవాల‌ని, లేకపోతే జీవరాశికి మనుగడ లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధతో చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా గత ఐదు సంవత్సరాల‌ నుంచి 172 కోట్ల మొక్కలు నాటడం జరిగిందని, ఈ సంవత్సరం ఆరో విడత హరితహారంలో 30 కోట్ల మొక్కలు నాటడం ల‌క్ష్యంగా పెట్టుకొని ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల‌ భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరుగుతున్నట్లు తెలిపారు.

కామారెడ్డి జిల్లాలో ఈ సంవత్సరం 65 ల‌క్షల‌ మొక్కలు నాటనున్నామన్నారు. ఈరోజు గాంధారి ఎక్స్‌ రోడ్‌ నుండి బాన్సువాడ వరకు ఆయా గ్రామాల‌ ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున హరితహారం కార్యక్రమంలో అవెన్యూ ప్లాంటేషన్‌ లో భాగస్వామ్యం కావడం అభినందనీయమని అన్నారు. మొక్కలు నాటే కార్యక్రమం ఒక యజ్ఞం లాంటిదని, ఇది నిరంతరం సాగే మానవ ఉపయోగ కార్యక్రమమన్నారు.

సకాంలో వర్షాలు కురవాలంటే చెట్లు నాటడం ఒకటే మార్గమని పేర్కొన్నారు. జిల్లాలోని మాచారెడ్డి మండల‌ పరిధిలో ఫారెస్ట్‌ అభివృద్ధి చేయడం వల‌న పచ్చదనం పెంపొంది సగటు వర్షపాతం నమోదైందని తెలిపారు. గాలి, నీరు, తిండి కలుషితమవుతున్నాయని, దీనిని అధిగమించడానికి మిషన్‌ భగీరథ కార్యక్రమంలో పైపులైన్ల ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందించడం జరుగుతున్నదని తెలిపారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్‌ వంటి విపత్కర పరిస్థితుల‌లో కూడా రైతులు, పేద వర్గాల‌ సంక్షేమ కోసం చేపట్టిన కార్యక్రమాల‌ను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతు బంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, 24 గంటల‌ ఉచిత కరెంటు, కెసిఆర్‌ కిట్స్‌, తదితర పథకాల‌తో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఆదర్శంగా నిల‌బడిరదని తెలిపారు. కరోనా మహమ్మారి విపత్తు సమయంలో కూడా రైతు సంక్షేమం కోసం 54 ల‌క్షల‌ 70 వేల‌ రైతు ఖాతాల‌లో ఏడు వేల‌ కోట్లు రూపాయలు రైతుబంధు అందించి రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నారని తెలిపారు.

కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు బీబీ పాటిల్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దఫేదార్‌ శోభా రాజు, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌, ఎల్లారెడ్డి శాసనసభ్యులు జాజుల‌ సురేందర్‌, జుక్కల్‌ శాసన సభ్యులు హనుమంత్‌ షిండే, ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్‌ భాస్కర్‌ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డి, జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి చంద్రమోహన్‌ రెడ్డి, జిల్లా అటవీ అధికారి వసంత, జిల్లా పరిషత్‌ ప్రాదేశిక సభ్యులు మండల ప్రజా పరిషత్‌ సభ్యులు మండల‌ ప్రాదేశిక సభ్యులు గ్రామ సర్పంచులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

ప్రభుత్వ సూచనలు తప్పక పాటించాలి

బాన్సువాడ, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం మొస్రా మండల‌ కేంద్రంలో మండల‌ ప్రజాపరిషత్‌ సర్వసభ్య ...

Comment on the article