Breaking News

రెండు వందల‌కు పైగా దేశాల‌లో సేవా కార్యక్రమాలు

నిజామాబాద్‌, జూన్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిచ్‌పల్లి మండలం మాధవనగర్‌ బైపాస్‌ రోడ్డు వద్ద నూతనంగా నిర్మించిన ల‌యన్స్‌ సేవా ట్రస్టు భవన్‌ ప్రారంభమైంది. ల‌యన్స్‌ డిస్ట్రిక్ట్‌ 324 డి గవర్నర్‌ ఇరుకుల‌ వీరేశం సోమవారం సాయంత్రం ట్రస్ట్‌ భవన్‌ను లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ల‌యన్స్‌ క్లబ్‌లు రెండు వందల‌కు పైగా దేశాల‌లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు.

సామాజిక సేవా కార్యక్రమాల‌ను మరింత విస్తరించేందుకు ల‌యన్స్‌ భవన్లు నిర్మించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే మాదవనగర్‌ వద్ద ల‌యన్స్‌ భవన్‌ను నిర్మించి సోమవారం ప్రారంభించడం జరిగిందన్నారు.

కార్యక్రమంలో ల‌యన్స్‌ క్లబ్‌ పూర్వ గవర్నర్లు పి.బసవేశ్వర రావు, డి.పెంటయ్య, జిల్లా కోశాధికారి అందె శివాజి, పీఆర్వో పి.ల‌క్ష్మినారాయణ, అదనపు కోశాధికారి కరిపె రవీందర్‌, జిల్లా చైర్మన్‌ పి.ల‌క్ష్మి, రీజియన్‌ చైర్మన్‌ గోపాల్‌ దాస్‌ అగర్వాల్‌, జోన్‌ చైర్మన్‌ ద్వారకాదాస్‌ అగర్వాల్‌, ట్రస్ట్‌ సభ్యు ఆనందరావు మయ్యా, అంకం ల‌క్ష్మణ్‌ తదితయి పాల్గొన్నారు.

Check Also

వృద్ధుల‌కు ‘ఆల‌న’తో చికిత్స

నిజామాబాద్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆద్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా ...

Comment on the article