Breaking News

మీ గ్రామంలో నెమ్మదిగా జరుగుతుంది వెంటనే పూర్తిచేయాలి

నిజామాబాద్‌, జూన్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల‌ ఆకస్మిక తనిఖీలో భాగంగా జిల్లా కలెక్టర్‌ నిజామాబాద్‌ రూరల్‌ మండలం రాంనగర్‌ గ్రామాన్ని సందర్శించారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ గ్రామంలో జరుగుతున్న శానిటేషన్‌, వైకుంఠ ధామం, కంపోస్టు షెడ్‌, డంపింగ్‌ యార్డ్‌, పార్క్‌ స్థలం, హరితహారం పనుల‌ను పరిశీలించారు. మొదట గ్రామంలో తిరిగి పారిశుద్ధ్యం పనుల‌ను పరిశీలించిన అనంతరం శానిటేషన్‌ బాగుందని అన్నారు.

ఊర్లో రోడ్ల వెంబడి మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాల‌ని, వైకుంఠధామం పనులు రూరల్‌ మండలంలోని అన్ని గ్రామాల‌లో పూర్తయినాయని, మీ గ్రామంలో చాలా నెమ్మదిగా జరుగుతున్నదని, వెంటనే పూర్తిచేయాల‌ని సర్పంచ్‌ను ఆదేశించారు, కంపోస్టు షెడ్‌, డంపింగ్‌ యార్డ్‌ ఒకే దగ్గర ఉండాల‌ని, గ్రామంలో గ్రీన్‌ పార్కు స్థలం కొరకు రెవిన్యూ సర్వే రేపు పూర్తి చేసి, హద్దులు ఏర్పరిచి గ్రామ పంచాయతీకి అప్పజెప్పాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

హరిత హారంలో గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా 2 వేల‌ మొక్కలు నాటి, నాలుగు వందల‌ మొక్కల‌కు ఒక వన సేవకుని చొప్పున మొత్తం అయిదుగురిని నియమించుకోవాల‌ని ఆదేశించారు. ఇంటర్నల్‌ రోడ్స్‌, అవెన్యూ ప్లాంటేషన్‌, కమ్యూనిటీ ప్లాంటేషన్‌ గురించి ఫీల్డ్‌ అసిస్టెంట్‌ను అడిగి తెలుసుకున్నారు. పనులు పూర్తి చేయని సర్పంచుకు సస్పెన్షన్‌ పెడతామన్నారు. కలెక్టర్‌ వెంట సర్పంచ్‌ హర్షి సమ్రీన్‌, తహసిల్దార్‌ ప్రశాంత్‌ కుమార్‌, ఎంపీడీవో సంజీవ్‌, ఆర్‌ఐ ప్రభు, సంబంధిత అధికారులు ఉన్నారు.

The following two tabs change content below.

Check Also

మరోసారి ఔదార్యం చాటుకున్న ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత నెల 24న మలేషియాలో గుండెపోటుతో చనిపోయిన బాల ...

Comment on the article