Breaking News

శనివారం వరకు టార్గెట్‌ పూర్తిచేయాలి

నిజామాబాద్‌, జూన్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ స్థలాలు, హరితహారం, రైతు వేదికల‌పై జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి జిల్లా అధికారి టార్గెట్‌ ఓరియంటెడ్‌గా పనిచేయాల‌న్నారు. ప్రభుత్వ భూములు గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ రెవిన్యూ ప్రాపర్టీస్‌ రికార్డులో వచ్చే సోమవారం వరకు ప్రాపర్టీస్‌ పహానితో ఉండాల‌న్నారు.

వచ్చే సోమవారం ప్రతి శాఖకు సంబంధించిన ప్రాపర్టీస్‌ పహానితో మీటింగ్‌కు రావాల‌న్నారు. ఈ వారం హరితహారం వారంగా పరిగణించాల‌ని, అన్ని శాఖల‌ అధికారులు తమ రెగ్యుల‌ర్‌ పనుల‌తో పాటు ఉదయం హరితహారం చేయాల‌ని ఆదేశించారు. శాఖ పరంగా ఇచ్చిన టార్గెట్‌ వచ్చే శనివారం వరకు పూర్తి కావాల‌న్నారు. పంచాయతీ రాజ్‌, ఆర్‌ అండ్‌, నేషనల్‌ హైవే, విద్యశాఖ, రోడ్లు ఇరువైపులా మొక్కులు ఉండేవిధంగా చర్యలు చేపట్టాల‌న్నారు.

వచ్చే సోమవారం నుండి పరిశీలిస్తామన్నారు. మొక్కలు 5 మీటర్ల గ్యాప్‌తో పెట్టాల‌న్నారు. ఏ ఒక్క రోడ్డు మిగల‌కూడదన్నారు. రోడ్‌ సైడ్‌ మొక్కలు రెండు మీటర్లున్న వాటిని పెట్టాల‌న్నారు. శాఖల‌ వారీగా ఇన్స్టిట్యూట్లలో మంచి మొక్కలు పెట్టాల‌న్నారు కార్యాల‌యాల్లో ఇచ్చిన టార్గెట్‌ శనివారం వరకు పూర్తి చేయాల‌న్నారు.

రైతు వేదికలు మూడు నెల‌ల్లో పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. వర్షాలు రాక ముందు ఇసుక‌ ప్లాన్‌ చేసుకోవాల‌న్నారు. మొత్తం 106 రైతు వేదికల‌కు గాను 102 సోమవారం మంజూరు ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్లు చంద్రశేఖర్, ల‌త, బిఎఫ్‌ ఓ సునీల్‌, డిఆర్‌డిఎ పిడి రమేష్‌ రాథోడ్‌, సంబంధిత శాఖల‌ అధికారులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article