Breaking News

ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి

ఆర్మూర్‌, జూన్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులు భర్తీ చేయాల‌ని, కరోనాను ఆరోగ్య శ్రీ లో చేర్చాల‌ని, కరోనా చికిత్సకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాల‌ని డిమాండ్‌ చేస్తూ పిడిఎస్‌యు, పివైఎల్‌, పివోడబ్ల్యు ఆధ్వర్యంలో ఆర్మూర్‌ ఆర్డీవో కార్యాల‌యం ఎదుట ధర్నా చేసి వినతి పత్రం అందజేశారు.

పివోడబ్ల్యు జిల్లా ఉపాధ్యక్షురాలు సత్తెక్క, పద్మ పివైఎల్‌ రాష్ట్ర నాయకులు సుమన్‌, పిడిఎస్‌యు అధ్యక్షుడు అనిల్‌ కుమార్‌, ప్రియాంక, దీపిక, నిమ్మ నిఖిల్‌, తూర్పటి శ్రీనివాస్‌, యుగంధర్‌ తదితరులు పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

26న విద్యుత్‌ అంతరాయం

కామారెడ్డి, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 26వ తేదీ గురువారం కామారెడ్డి 132 కె.వి ...

Comment on the article