Breaking News

నష్టపోయిన వారికి ప్రాధాన్యత ఇస్తాం

నిజామాబాద్‌, జూన్‌ 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నాగారంలో గల‌ డబుల్‌ బెడ్రూమ్‌ సైట్‌ను జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పరిశీలించారు. సోమవారం నిజామాబాద్‌ నగరంలోని నాగారం, కొత్త కలెక్టరేట్‌ వెనకాల‌ నిర్మాణంలో ఉన్న డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ అనంతరం మాట్లాడుతూ నాగారం, భారత్‌ రాణిలోని సైట్లను పరిశీలించామని, 3 ఎకరాల‌ 39 గుంటల‌ స్థలంలో ఇండ్లు నిర్మించుటకు పనులు వేగవంతం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

నిజామాబాద్‌ పట్టణంలో 2 వేల‌ 300 డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు నిర్మాణానికి మంజూరు ఉందని, నిర్మాణానికి స్థల‌ నిర్ధారణ పూర్తయిందని, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు కట్టే క్రమంలో నష్టపోయిన వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. తర్వాత ఇండ్ల‌, ప్లాట్లు లేనివారు, అందులో ఎక్కువ కుటుంబ సభ్యులు ఉన్న వారికి అనంతరం తక్కువ ఫ్యామిలీ మెంబర్స్‌ ఉన్నవారికి ఇస్తామని తెలిపారు.

396 ఇళ్లు ఇప్పటివరకు పూర్తయ్యాయని, వాటి నిర్మాణంలో నష్టపోయిన 14 మందికి ముందు ఇవ్వాల‌ని నిర్ణయించామని, మున్సిపల్‌ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికలు, సొసైటీ ఎన్నికలు, కరోనా లాక్‌ డౌన్ వ‌ల్ల ప్రారంభించలేదని, అవి వెంటనే ఇప్పించే ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం కొత్త కలెక్టరేట్‌ వెనకాల‌ డబుల్‌ బెడ్‌ రూమ్‌ నిర్మాణం పనులు పరిశీలించారు. వర్షపు నీరు, డ్రైనేజీ వాటర్ నిల‌వకుండా ఏర్పాటుచేసిన నాల‌ను పరిశీలించారు.

అనంతరం కాంట్రాక్టర్‌తో పని వేగంగా జరగాల‌ని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట ఆర్డిఓ వెంకటయ్య, డిసిఓ సింహాచలం, ఆర్‌అండ్‌బి డిఈ సుధాకర్‌, ఇరిగేషన్‌ ఈ ఈ ఆత్మారామ్‌, సంబంధిత శాఖల‌ అధికారులు ఉన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article