Breaking News

ప్రభుత్వ సూచనలు తప్పక పాటించాలి

బాన్సువాడ, జూన్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం మొస్రా మండల‌ కేంద్రంలో మండల‌ ప్రజాపరిషత్‌ సర్వసభ్య సమావేశంలో తెరాస నాయకులు పోచారం సురేందర్‌ రెడ్డి, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 6వ విడత హరితహారంలో భాగంగా మొక్కలు నాటి నీరుపోశారు.

భాస్కర్‌ రెడ్డి మాట్లాడుతూ దేశంలో కరోన వ్యాధి విజృంభిస్తున్న తరుణంలో ప్రతీ ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాల‌ని, రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న సూచనల‌ను పాటిస్తూ నిత్యం చేతుల‌ను శుభ్రం చేసుకుంటూ, ఇంట్లో నుండి బైటకి వెళ్లేటపుడు తప్పనిసరి మాస్కు ధరించాల‌ని కోరారు. మూడు సంవత్సరాల‌ కిందటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పల్లె ప్రగతి కార్యక్రమం ప్రారంభించారని, పల్లె ప్రగతి ముఖ్య ఉద్దేశం ప‌ల్లెలు శుభ్రంగా ఉంటేనే మనందరం ఆరోగ్యంగా ఉంటామన్నారు.

అంతేకాక నేడు హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరం మొక్కల‌ను నాటి సంరక్షించుకోవాల‌ని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉమా శ్రీరాములు, జడ్పీటీసీ భాస్కర్‌ రెడ్డి, ఏఎంసి చైర్మన్‌ సంజీవు, మండల‌ రైతు బంధు అధ్యక్షుడు శ్రీరాములు, అన్ని గ్రామాల‌ సర్పంచులు, ఎంపీటీసీలు, సెక్రెటరీలు, అధికారులు ఎంపీడీఓ భారతి, తశీల్ధార్‌ ముజీబ్‌, ఎంఇఓ శాంతకుమారి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

చిన్నారుల‌ను ఆదుకోవడం మా బాధ్యత

బాన్సువాడ, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్ని మండలం తగిలేపల్లి గ్రామంలో గత నెల‌లో ఇంటి ...

Comment on the article