Breaking News

హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలి

కామారెడ్డి, జూన్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కట్టడి చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫల‌మైందని వెంటనే హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాల‌ని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాసరావు అరోపించారు. కరోనా వ‌ల్ల‌ రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. పక్క రాష్ట్రాల్లో ల‌క్షల‌ సంఖ్యలో కరోనా టెస్ట్‌లు చేస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 50 వేల‌ కరోనా టెస్ట్‌లు కూడా చేయడం లేదని తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడారు.

సామాన్య ప్రజల‌కు కరోనా వస్తే గాంధీలో చికిత్స పొందితే టిఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మాత్రం ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల‌ చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల‌కు ఒకరకమైన చికిత్స, పేదల‌కు మరో చికిత్సనా అని ప్రశ్నించారు. లాక్‌ డౌన్‌ సమయంలో మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ తన ప్రాణాలు లెక్కచేయకుండా ఉమ్మడి జిల్లాలో సుమారు 65 రోజుల‌ పాటు కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో వల‌సకూలీల‌కు, యాచకుల‌కు భోజనం ఏర్పాటు చేశామన్నారు.

కామారెడ్డి నియోజకవర్గంలో ఆరు వేల‌కు పైగా నిత్యావసర సరుకుల‌ను కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగిందని గుర్తుచేశారు. తాను షబ్బీర్‌ అలి ఆదేశాల‌ మేరకు మంగళవారం వరకు కూడా అన్నదానం చేస్తూ పేదప్రజల‌కు తోచిన సహాయం చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ అండగా నిల‌బడిరదన్నారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌ డీజిల్ ధరల‌ను పెంచడం వ‌ల్ల‌ పేద ప్రజల‌పై పెనుభారం పడుతుందన్నారు. కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, పట్టణ యూత్‌ అధ్యక్షుడు గడుగు శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి దాత్రీక సత్యం, మాజీ కౌన్సిల‌ర్‌ గోనే శీను, ల‌క్క పతిని గంగాధర్‌, షేరు, సర్వర్‌, వలిపిశెట్టి భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article