Breaking News

చిన్నారుల‌ను ఆదుకోవడం మా బాధ్యత

బాన్సువాడ, జూన్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్ని మండలం తగిలేపల్లి గ్రామంలో గత నెల‌లో ఇంటి ప్రహారి గోడ కూలిన దుర్ఘటనలో బాధిత కుటుంబానికి డబుల్‌ బెడ్‌ రూం ఇంటిని కేటాయించి మంగళవారం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డిసిసిబి అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి, రాష్ట్ర తెరాస పార్టీ యువనాయకులు పోచారం సురేందర్‌ రెడ్డి గృహ ప్రవేశం చేయించారు.

గత నెల‌ జరిగిన ప్రమాదంలో తల్లిదండ్రులు మరణించగా ముగ్గురు అమ్మాయిలు గాయపడ్డారు. ముగ్గురు అమ్మాయిల‌కు రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చికిత్స చేయించారు. ప్రస్తుతం ఆ ముగ్గురు అమ్మాయిలు అమ్మమ్మ సంరక్షణలో ఉన్నారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాసరెడ్డి సూచనతో భాస్కర్‌ రెడ్డి, సురేందర్‌ రెడ్డి ఇల్లు లేని వారికి తక్షణమే ఇంటిని కేటాయించి, గృహ ప్రవేశం చేయించారు. అదేవిధంగా ఖర్చుల‌ కొరకు పోచారం భాస్కర్‌ రెడ్డి స్వంతంగా ఇరవై అయిదు వేల‌ రూపాయలు అందించారు.

తల్లిదండ్రుల‌ను కోల్పోయిన చిన్నారుల‌ను ఆదుకోవడం తమ బాధ్యత అని, భవిష్యత్తులో కూడా వారికి ఏ అవసరం వచ్చినా అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ వారిని ఆదుకుంటామని పోచారం భాస్కర్‌ రెడ్డి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వర్ని మండల‌ ఎంపీపీ ల‌క్ష్మీ వీరాజు, ఏఎంసి అధ్యక్షుడు సంజీవులు, ప్యాక్స్‌ చైర్మన్‌ నామా సాయిబాబు, సర్పంచ్‌ మైసం వెంకటేష్‌, ఎంపీటీసీ నారాయణ, వైస్‌ ఎంపీపీ బారాజు, కో ఆప్షన్‌ సభ్యు కరీం, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

The following two tabs change content below.

Check Also

ప్రభుత్వ సూచనలు తప్పక పాటించాలి

బాన్సువాడ, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం మొస్రా మండల‌ కేంద్రంలో మండల‌ ప్రజాపరిషత్‌ సర్వసభ్య ...

Comment on the article