Breaking News

మత మార్పిడుల‌ను అడ్డుకోవాల్సిందే

కామారెడ్డి, జూన్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒరిస్సా ప్రాంతం నుంచి భాగ్యనగర్‌ వచ్చి పని చేసుకుంటున్న ఒరిస్సా ప్రాంత ప్రజల‌కు విశ్వహిందూ పరిషత్‌ అండగా ఉంటుందని, ఎవరికి ఏ అవసరం వచ్చినా విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌ కార్యకర్తల‌ను సంప్రదించాల‌ని విశ్వహిందూ పరిషత్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజేశ్వర్‌ రెడ్డి సూచించారు. మంగళవారం మియాపూర్‌లో సమావేశం నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్‌ ప్రాంత సహ ప్రచార ప్రముఖ్‌ పగుడాకుల బాల‌స్వామి, బజరంగ్‌ దళ్‌ స్టేట్‌ కో కన్వీనర్‌ శివ రాము, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు జ్ఞానేంద్ర ప్రసాద్‌, పృధ్వి గౌడ్‌ హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాజేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ హిందూ సంఘటనతోనే మత మార్పిడుల‌ను అరికట్టవచ్చన్నారు. హిందువులంతా కలిసి దేవాల‌యాల‌ను దర్శించుకోవాల‌ని, సత్సంగాలు తప్పనిసరిగా నిర్వహించుకోవాల‌ని పేర్కొన్నారు. హిందుత్వంలో ఉన్న పేదరికం, కులాల‌ మధ్య అసమానతలు, అవగాహన లోపం వ‌ల్ల‌ మతమార్పిడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మన చుట్టుపక్క ఉన్న హిందువుల‌ను మనం చూస్తుండగానే క్రైస్తవులు మతం మారుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

మొట్టమొదట పేదరికాన్ని ఆసరా చేసుకొని పది వేలు, లేక ఐదు వేల‌ రూపాయలు ఆర్థిక సహాయం చేసి క్రైస్తవులు హిందువుల‌ను తమ మతంలోకి మారుస్తున్నారని, తరువాత మతం మారిన హిందువుల‌ చేత ప్రతి నెల‌ ముక్కు పిండి డబ్బు వసూలు చేస్తున్న పాస్టర్‌ బాగోతాలు నిత్యం వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందేనన్నారు.

కాబట్టి మన చుట్టుపక్క ఉన్న హిందువుల‌ను మతం మారకుండా చూసి, మతం మారిన వారిని తిరిగి స్వధర్మంలోకి తీసుకురావాల్సిన బాధ్యత మన పైనే ఉందన్నారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్‌ నాయకుల‌ను ఒరిస్సా ప్రతినిధులు సన్మానం చేశారు. జగన్నాథుడి చిత్రపటాల‌ను బహూకరించారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article