Breaking News

రైతు వ్యతిరేక ఆర్డినెన్సు ఉపసంహరించుకోవాలి

కామారెడ్డి, జూన్‌ 30

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లాలోని కలెక్టర్‌ కార్యాల‌యం ముందు ఏఐకెఎస్‌ (తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం) ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం విడుదల‌ చేసిన వ్యవసాయ సంబంధిత రైతు వ్యతిరేక ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాల‌ని కలెక్టర్‌ కార్యాల‌యం ముందు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌ కార్యాల‌యంలోని ఏవో శ్రీనివాసరావుకి వినతి పత్రం ఇచ్చారు.

ఈ సందర్భంగా ఏఐకెఎస్ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, జూకంటి సుధాకర్‌ రెడ్డి, జిల్లా నాయకులు బండారి రాజిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల‌ చేసిన వ్యవసాయ సంబంధిత రైతు వ్యతిరేక ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాల‌ని వారన్నారు. అంతే కాకుండా నిత్యావసర సరుకుల‌ చట్టం సవరణ వ్యవసాయ ఉత్పత్తుల‌ను, ధాన్యాలు, పప్పు ధాన్యాలు నూనె గింజలు, ఉల్లిగడ్డ, అలుగడ్డ నిత్యావసర సరుకుల‌ జాబితా నుంచి తొల‌గిస్తుందని వారన్నారు.

అలాగే వ్యవసాయ ఉత్పత్తుల‌ ఎగుమతి దారుల నిలువ‌ పరిమితిని ఈ చట్టం నుంచి తొల‌గిస్తుందని పేర్కొన్నారు. వ్యవసాయ రంగ ఉత్పత్తుల‌ అమ్మకం, వాణిజ్యం ఆర్డినెన్స్‌ ద్వారా రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తుల‌ మార్కెటింగ్‌ చట్టాల‌ను ఉల్లంఘించి, మార్కెట్‌ యార్డ్‌ బయట కూడా ఎక్కడైనా, ఎప్పుడైనా ఎల‌క్ట్రానిక్‌ ఫ్లాట్‌ ఫామ్‌పై కూడా కొనుగోలు వ్యాపారం చేసుకోవచ్చన్నారు.

అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 3 వ ఆర్డినెన్స్‌ రైతు సాధికారత మరియు రక్షణ ధర హామీ సేవల‌ ఒప్పందం ఆర్డినెన్స్‌ 2020 లో ఈ ఆర్డినెన్స్‌ ప్రకారం రైతు వ్యాపారుల‌తో వాణిజ్య కంపెనితో నేరుగా కాంట్రాక్టు వ్యవసాయం ఒప్పందం చేసుకోవాల‌ని, ఈ ఒప్పందం ప్రకారం నాణ్యత పేరుతో రైతు పంటల‌ను ఒప్పందం చేసుకోరని ఈ ఒప్పందం నేరుగా యజమానికి రైతు మధ్య ఏజెంట్లు ఉంటారని అన్నారు.

కంపెనీ రైతుల‌ను మోసం చేసే విధంగా ఉన్న ఈ ఆర్డినెన్స్‌ ను ఉపసంహరణ చేసుకోవాల‌ని వారు డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు బండారి రాజిరెడ్డి, ఎల్‌.దశరథ్‌, బాల‌రాజు, ఎస్‌ ఆర్‌ .శేఖర్‌, నరేష్‌, వీరయ్య, నారాయణ, స్వామి, రాజయ్య, నర్సింలు, భూమన్న, శ్రీనివాస్‌ తదితరులు ఉన్నారు.

Check Also

మత మార్పిడుల‌ను అడ్డుకోవాల్సిందే

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఒరిస్సా ప్రాంతం నుంచి భాగ్యనగర్‌ వచ్చి పని చేసుకుంటున్న ...

Comment on the article