Breaking News

Monthly Archives: July 2020

జ్ఞాపకశక్తి లేక 16 ఏళ్లుగా దుబాయిలోనే

నిజామాబాద్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా దోమకొండ మండలం చింతమానుపల్లి గ్రామానికి చెందిన నీల ఎల్ల‌య్య 2004 లో ఒక కంపెనీలో భవన నిర్మాణ కూలీగా దుబాయికి వెళ్ళాడని, కొంత కాలం బాగానే ఉన్నప్పటికీ మానసిక స్థితి సరిగాలేక కంపెనీ నుండి బయటకు వెళ్ళిపోయి ‘ఖల్లివెల్లి’ (అక్రమ నివాసి) గా మారాడని ఎమిగ్రేంట్స్‌ వెల్ఫేర్‌ ఫోరం అధ్యక్షుడు మంద భీంరెడ్డి పేర్కొన్నారు. గత 16 సంవత్సరాలుగా దుబాయి, షార్జా ప్రాంతాల‌లో చిన్నచిన్న పనులు చేసుకుంటూ ఎల్ల‌య్య జీవిస్తున్నాడని, ...

Read More »

పిడి యాక్టు నమోదు చేయాలి

కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా సదాశివనగర్‌ మండల‌ తహసిల్దార్‌ కార్యాల‌యంలో సమాచార సేకరణ కోసం వెళ్లిన ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి రిపోర్టర్‌ శ్రీనివాస్‌పై అక్కడే ఉన్న కటిక రమేష్‌ అనే వ్యక్తి ఎలాంటి కారణం లేకుండా దాడికి పాల్ప‌డి చేయి విరగొట్టడం జరిగిందని, తహసిల్దార్‌ కార్యాల‌యం సాక్షిగా దాడి జరిగినా అక్కడే ఉన్న రెవెన్యూ సిబ్బంది అడ్డుకోకుండా కనీసం పోలీసుల‌కు సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వెనుక కుట్ర దాగి ఉందని ఎంసిపిఐయు పార్టీ జిల్లా కార్యదర్శి ...

Read More »

టీజీవిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విద్యార్థి పరిషత్‌ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో టీజీవిపి 8 వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక కొత్త బస్టాండ్‌ ముందు టీజీవిపి గద్దె వద్ద రాష్ట్ర కార్యదర్శి ఎనుగందుల‌ నవీన్‌ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీజీవిపి 2012 జులై 31 న రాష్ట్ర రాజధాని బషీర్‌ బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌లో ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమకారుల‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై ఏర్పాటు చేసిన విద్యార్థి సంఘం ...

Read More »

నిజామాబాద్‌ జిల్లా నూతన కమిటీ

నిజామాబాద్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా శుక్రవారం జిల్లా నూతన కమిటీని నియమించినట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వా క్ష్మీ నర్సయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని వర్గాల‌కు, అన్ని ప్రాంతాల‌కు సమానమైన ప్రాతినిధ్యం కల్పిస్తూ నాయకులందరినీ కలుపుకొని సీనియర్లు, నూతనంగా పార్టీలో చేరిన వారందరి కల‌యికతో సమర్థవంతమైన నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కమిటీలో ఉన్న అందరూ కూడా పార్టీ కోసం ఉత్సాహంగా పని చేయాల‌ని, పార్టీలో క్రియాశీల‌కంగా ...

Read More »

బక్రీద్‌ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ముస్లిం సోదర సోదరీమణుల‌కు బక్రీద్‌ పండుగ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటన విడుదల‌ చేస్తూ కోవిడ్‌ నేపథ్యంలో బక్రీద్‌ సందర్భంగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాల‌ని, మాస్కులు ధరించాల‌ని, 6 ఫీట్ల భౌతికదూరం పాటించాల‌ని, సానిటైజర్‌ తో కానీ, సబ్బుతో కానీ చేతులు ఎప్పటికప్పుడు శుభ్రపరుచుకోవాల‌ని అన్నారు. అలాగే వక్ఫ్‌ బోర్డ్‌ సూచన మేరకు బక్రీద్‌ పండుగ సందర్భంగా ప్రార్థన ...

Read More »

10 లోగా పూర్తి చేయాలి

నిజాంసాగర్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప‌ల్లెలు పల్లె ప్రగతి కార్యక్రమాల‌ ద్వారా ప్రకాశవంతంగా మారుతున్నాయని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ కుమార్‌ అన్నారు. పిట్లం, జుక్కల్‌, మద్నూర్‌ ఎంపీడీవో కార్యాల‌యాల‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి పనులు ఆగష్టు 10 లోగా పూర్తిచేయాల‌ని సూచించారు. కంపోస్టు షెడ్ల ఏర్పాటుతో ప్రతి గ్రామం సంపద కేంద్రంగా మారాల‌న్నారు. ప్రతి మండల‌ కేంద్రంలో మోడల్‌ కంపోస్టు షెడ్డు ఏర్పాటు చేయాల‌ని తెలిపారు. హోమ్‌ స్టీడ్‌ మొక్కల‌కు సంబంధించి ...

Read More »

దళితుల‌ అణిచివేతపై నిరసన గళం

ఆర్మూర్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దళితుల‌ అణిచివేత పై ఆర్మూర్‌ పట్టణ శాఖ దళిత మోర్చా బిజెపి శ్రేణులు ఆర్మూర్‌ తహసీల్‌ కార్యాయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ఏర్పాటు కాగానే మొట్టమొదట దౌర్భాగ్యం ఆర్మూర్‌ నియోజకవర్గంలో ఇద్దరు దళితుల‌ను హత్య చేయించడం, ఇది అందరికీ తెలిసిన విషయమేనన్నారు. నాటి నుంచి ...

Read More »

స్వచ్చంద లాక్‌డౌన్‌ పాటిద్దాం

ఆర్మూర్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్చందంగా ఆర్మూర్‌లో ప్రజలందరూ లాక్‌ డౌన్‌ పాటించి కరోనా మహమ్మారిని తరిమికొట్టాల‌ని మహ సర్వ సమాజ్‌ తన అభిప్రాయం వ్యక్తం చేసింది. కాగా శుక్రవారం ఏసిపికి, ఆర్డీవోకి ఎమ్మార్వోకి, మునిసిపల్‌ కమిషనర్‌కి వినతి పత్రం అందజేసినట్లు అధ్యక్షుడు సుంకరి రవి, ఉపాధ్యక్షుడు పూజ నరేందర్‌, కోశాధికారి గుండెటి రాజశేఖర్‌, ముఖ్య సహాదారులు గడ్డం శంకర్‌, సభ్యులు అరే రాజేశ్వర్‌, జిమ్మీ రవి తెలిపారు.

Read More »

గ్రంథాల‌యాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ఆర్మూర్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెండోరా మండలం సావెల్‌ గ్రామంలో గ్రంధాల‌యం ప్రారంభమైంది. గ్రామానికి చెందిన కొండ గంగామణి జనార్దన్‌ దంపతులు సౌజన్యంతో పంచాయతీ భవన సముదాయంలో ఏర్పాటు చేసిన గ్రంధాల‌యాన్ని సర్పంచ్ నేల‌ లావణ్య లింగన్న ప్రారంబించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ లావణ్య మాట్లాడుతూ కొండ గంగామణి జనార్దన్‌ దంపతులు తమ సొంత ఖర్చుతో గ్రంధాల‌యం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గ్రామ ప్రజలు గ్రంధాల‌యాన్ని వినియోగించుకోవాల‌ని సూచించారు. కార్యక్రమంలో గ్రంధాల‌య చైర్మెన్‌ కొండ సంతోష్‌, ఎంపిటిసి పుప్పాల‌ ...

Read More »

శీతల‌ శవ పేటిక వితరణ

కామారెడ్డి, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్య వైశ్య సంఘం పెద్ద కొడపగల్‌ వారి తరుపున శీతల‌ శవ పేటికను పెద్దకొడపగల్‌ గ్రామ పంచాయితీకి వితరణ చేశారు. కార్యక్రమంలో మండల‌ అధ్యక్షు శ్రీరామ్‌ సుధాకర్‌, ఉపాధ్యక్షుడు వంగపల్లి అనిల్‌ కుమార్‌, గ్రామ సర్పంచ్‌ వంగలి తిర్మల్‌ రెడ్డి, పంచాయితీ సెక్రెటరీ, వైశ్య సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

Read More »

రక్తదానం

కామారెడ్డి, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన చెందిన హీనా అంజుమ్‌ 30 సంవత్సరాల‌ వయసు కలిగిన మహిళ పట్టణ కేంద్రంలోని అఖిల‌ వైద్యశాల‌లో రక్తహీనతతో బాధపడుతుండడంతో వారికి బి పాజిటివ్‌ రక్తం అవసరమైంది. వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించడంతో బిగ్‌ సి మొబైల్స్‌ స్టోర్‌ మేనేజర్‌ రమేష్‌ మానవతా దృక్పథంతో సకాలంలో స్పందించి వి.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో బి పాజిటివ్‌ రక్తం అందించి ప్రాణాలు కాపాడారు. అత్యవసర ...

Read More »

12 నుంచి నిరవధిక సమ్మె

నిజామాబాద్‌, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సివిల్‌ సప్లై హమాలీల‌ గత ఒప్పందం డిసెంబర్‌ 31, 2019తో ముగిసిందని, నూతన వేతన ఒప్పందం జనవరి 1, 2020 లో అమలులోకి రావాల్సినా ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా అమలు జరగలేదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓ మయ్య అన్నారు. ఈ మేరకు గురువారం ఏఐటీయూసీ జిల్లా కార్యాల‌యంలో సివిల్‌ సప్లై హమాలీ ముఖ్య కార్యకర్తల‌ సమావేశం నిర్వహించారు. అనంతరం సమ్మె నోటీసును సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ డిఎం అభిజిత్‌ ...

Read More »

మనోధైర్యంతో ముందుకెళ్ళాలి

నిజామాబాద్‌, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ వ్యాధి విస్తరిస్తోందని, మండలాల్లో, గ్రామాల్లో కూడా కేసులు వస్తున్నాయని, ఇటువంటి సమయంలో మనం మనోధైర్యం తో ముందుకు వెళ్లాల‌ని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. గురువారం జిల్లాలోని ఎమ్మార్వోలు, మెడికల్‌ ఆఫీసర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇలాంటి సమయంలో మనం భయానికి లోను కాకుండా సంయమనంతో వ్యవహరించాల‌ని, ప్లాన్‌ ప్రకారం ముందుకు పోవాల‌ని సూచించారు. నిజామాబాద్‌లో ఇంతకు ముందు 12 కంటైన్మెంట్‌ జోన్లు పెట్టుకోవడమైనదని, అదేవిధంగా ...

Read More »

2020-21 వార్షిక ఋణ ప్రణాళిక విడుదల

నిజామాబాద్‌, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాకు సంబంధించిన 2020-21 వార్షిక ఋణ ప్రణాళికను జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి విడుదల‌ చేశారు. గురువారం కలెక్టర్‌ కాంప్‌ కార్యాల‌యంలో జిల్లా వార్షిక ఋణ ప్రణాళికను విడుదల‌ చేసిన అనంతరం మాట్లాడారు. గత సంవత్సరం కంటే 412.18 కోట్ల అధిక మొత్తంతో రూపాయలు 6016.36 కోట్లతో ప్రణాళిక తయారు చేయడం జరిగిందని, ప్రాథమిక సెక్టార్లకు 97.24 శాతం అనగా 5820.87 కోట్లు కేటాయించడం జరిగిందని అందులో పంట రుణాల‌ కోసం ...

Read More »

ప్రగతి భవన్‌లో వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ

నిజామాబాద్‌, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి నిజామాబాద్‌ (నిజామాబాద్‌, కామారెడ్డి కొత్త జిల్లాలు) జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల‌లో పనిచేయటానికి 20 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల‌ను కాంట్రాక్ట్‌ పద్ధతిపై భర్తీ చేసేందుకు ఈనెల‌ 31న కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌లో వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పోస్టులు ప్రస్తుతం ఒక సంవత్సరం కొరకు (అవసరమైతే పెంచబడుతుంది) కాంట్రాక్ట్‌ పద్దతిలో పని చేసేందుకు ఎంపిక చేయబడుతుందని, ఎంపికైన అభ్యర్థుల‌కు నెల‌కు ...

Read More »

వక్ఫ్‌బోర్డు మార్గదర్శకాలు పాటించాలి

నిజామాబాద్‌, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు సూచించిన మార్గదర్శకాల‌కు అనుగుణంగా రాష్ట్రంలో బక్రీద్‌ పండుగను జరుపుకోవాల‌ని, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సూచనల‌కనుగుణంగా జిల్లాలోని ముస్లింలంతా బక్రీద్‌ పండుగను జరుపుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి కోరారు. గురువారం ఒక ప్రకటన విడుదల‌ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఆగస్టు 1వ తేదీన బక్రీద్‌ పండుగ సందర్భంగా కోవిడ్‌ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల‌ని, ప్రజలు రెండు మీటర్లు లేదా 6 ...

Read More »

హోమియో మాత్రల‌ పంపిణీ

ఎల్లారెడ్డి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి మున్సిపల్‌ పరిధిలో బుధవారం రోగ నిరోధక శక్తి పెంపు హోమియో మాత్రల‌ను స్థానిక ఎమ్మెల్యే జాజాల‌ సురేందర్‌ పంపిణీ చేశారు. ఎల్లారెడ్డి మున్సిపల్‌ పరిధిలో గల‌ బాలాగౌడ్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన హోమియో కేర్‌ ఇంటర్నేషనల్‌ ఇమ్యూనిటీ బూస్టర్‌ కిట్లను జహీరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు బి బి పాటిల్‌ ఉచితంగా తన స్వంత ఖర్చుతో పంపిణీ చేస్తున్న రోగ నిరోధక శక్తిని పెంపొందించే కిట్‌ను ఎల్లారెడ్డి మండల‌ గ్రామ సర్పంచ్‌ల‌కు, ...

Read More »

వరద నీటితో వాహనదారుల‌కు ఇబ్బందులు

నిజాంసాగర్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని నర్సింగ్‌ రావు పల్లి గ్రామ శివారులో గల న‌ల్ల‌వాగు మత్తడి నీటి ప్రవాహంతో పొంగి పొర్లుతుంది. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాల‌కు న‌ల్ల‌వాగు మత్తడి పైనుంచి నీరు పొంగిపొర్లి వేగంగా ప్రవహిస్తుంది. సంగారెడ్డి జిల్లా కల్హేర్‌, న‌ల్ల‌వాగు, సిర్గాపూర్‌, మాసన్‌ పల్లి, బాచపల్లి తదితర ప్రాంతాల‌లో కురిసిన భారీ వర్షాల‌కు వరద నీరు భారీగా ప్రవహిస్తుంది. న‌ల్ల‌వాగు మత్తడి నీరు గోదావరిలోకి ప్రవహించడంతో నాగమడుగు మత్తడిలోకి నీటి ప్రవాహంతో ...

Read More »

పంచాయతీకి ఆదాయాన్ని సమకూర్చుకోవాలి

కామారెడ్డి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆగస్టు 15 లోగా అన్ని గ్రామాల్లో ఎరువులు కంపోస్ట్‌ షెడ్ల‌ు కేంద్రాలు ఏర్పాటు చేయాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. నాగిరెడ్డిపేట మండల‌ పరిషత్‌ కార్యాల‌యంలో బుధవారం అధికారుల‌తో సమీక్షించారు. తడి పొడి చెత్త వేరు చేసి సేంద్రియ ఎరువులు తయారుచేసి గ్రామాల్లో విక్రయించి పంచాయతీకి ఆదాయాన్ని సమకూర్చుకోవాల‌ని సూచించారు. మండలానికి పల్లె ప్రగతి కింద రూ.10.76 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. స్మశాన వాటిక నిర్మాణం, అవెన్యూ ప్లాంటేషన్‌ ...

Read More »

నాణ్యత పాటించకపోతే చర్యలు

కామారెడ్డి, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు వేదిక భవనాల‌ నిర్మాణం పనులు త్వరిత గతిన పూర్తి చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అన్నారు. లింగంపేట మండలం పరిమళ, నాగిరెడ్డిపేట మండలం చిన్న ఆత్మకూరు, మాల్‌ తుమ్మెద రైతు వేదిక భవనాల‌ నిర్మాణం పనుల‌ను బుధవారం ఆయన పరిశీలించారు. భవనాల‌ నిర్మాణంలో నాణ్యత పాటించకపోతే ఇంజనీరింగ్‌ అధికారుల‌పై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆగస్టు 15 లోగా పనులు పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ఎంపీడీవోలు మల్లికార్జున్‌ రెడ్డి, శ్యామల‌, ...

Read More »