Breaking News

జూలై 15 లోగా పూర్తిచేయకుంటే చర్యలు

నిజామాబాద్‌, జూలై 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి పర్యటనలో భాగంగా మోపాల్‌ మండలం, కాసు బాక్‌ తాండ, శ్రీ రామ్‌ నగర్‌ తాండ సందర్శించారు. తండాలో జరుగుతున్న శానిటేషన్‌ పనులు, వైకుంఠధామం, కంపోస్టు షెడ్‌ నిర్మాణం, హరితహారం పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ కంపోస్ట్‌ షెడ్డు జూలై 10 మరియు వైకుంఠ దామం పనులు జులై 15వ తేదీలోగా పూర్తి చేయాల‌ని, చేయకుంటే గట్టి యాక్షన్‌ తీసుకోవడం జరుగుతుందని సర్పంచ్‌కి తెలిపారు.

తండాలో రోడ్‌ సైడ్‌ ఉన్న పాడు పడ్డ బావిని వెంటనే పూడ్చి వేయాల‌ని, బావి యజమాని పూడ్చానట్లయితే గ్రామ పంచాయతీ నుండి పూడ్చి పెనాల్టీ వేయాల‌న్నారు. అనంతరం రోడ్‌ సైడ్‌ హరిత హారంలో నాటిన మొక్కల‌ను పరిశీలించారు. మొక్కలు చాలా చిన్నవిగా ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో కోటి 14 ల‌క్షల‌ మొక్కలు ఉన్నాయని, అందులో ఒక మీటర్‌ ఎత్తు ఉన్నవి 75 ల‌క్షలు ఉన్నాయని, మీ నర్సరీలో మొక్కలు చిన్నవి ఉంటే వేరే నర్సరీ నుండి తెచ్చుకోవాల‌న్నారు.

నర్సింగ్‌ పల్లి వద్ద నీటుగా మొక్కలు నాటారని, రోడ్‌ వెంబడి పెద్ద మొక్కలు పెట్టి ట్రీ గార్డ్‌ ఏర్పాటు చేయాల‌ని, మొక్కలు అయిదు మీటర్ల గ్యాప్‌లో ఒక మొక్క ఉండేవిధంగా పెట్టాల‌ని, ఐదుగురిని గ్రామ వన సేవకుల‌ను నియమించుకొని వారితో గ్రామంలో రోడ్లపైన చెత్త లేకుండా శుభ్రం చేయించాల‌ని, మొక్క పాదుల‌ వద్ద పిచ్చి మొక్కలు లేకుండా శుభ్రం చేయించాల‌ని, మొక్కల‌కు వాటర్‌ పోయించాల‌న్నారు.

వీరికి ఉపాధిహామీ నిధుల‌ నుండి రోజుకి 237 రూపాయలు ఇస్తామన్నారు. కంపోస్టు షెడ్‌ క్రిమీటోరియమ్‌, డంపింగ్‌ యార్డ్‌ రెగ్యుల‌ర్‌ పనిలా కాకుండా ప్రత్యేకంగా చూడాల‌ని, ఫాస్ట్‌గా చేయాల‌న్నారు. కలెక్టర్‌ వెంట ఎంపీడీవో మందపల్లి మల్లేష్‌, తహసీల్దార్‌ వీర్‌ సింగ్‌, సర్పంచ్‌ మెగావత్‌ వసంత, ఎంపిటిసి రాము, సెక్రెటరీలు మహేందర్‌, క్రాంతి కుమార్‌ తదితరులు ఉన్నారు.

Check Also

నత్త నడక పనుల‌పై కలెక్టర్‌ అసహనం

నిజామాబాద్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ క్రింద ప్రభుత్వ శాఖలు పనుల‌ను గుర్తించి, ఎస్టిమేట్లు ...

Comment on the article