Breaking News

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో డాక్టర్స్‌ డే

నిజామాబాద్‌, జూలై 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లా పద్మశాలి సంఘం ఆద్వర్యంలో బుదవారం డాక్టర్స్‌ డే నిర్వహించారు. నిజామాబాదు కోటగల్లిలోని పద్మశాలి భవన్‌ లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నాగేశ్వరరావు, డాక్టర్‌ నరేంద్ర, డాక్టర్‌ ఎ.సత్యనారాయణ, డాక్టర్‌ సుభాష్‌, డాక్టర్‌ కొండ సంతోష్‌, డాక్టర్‌ అంకం గణేష్‌ తదితరుల‌ను సన్మానించారు.

కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్ష,కార్యదర్శులు డి.యాదగిరి, పి.హన్మాండ్లు, కోశాధికారి గుడ్ల భూమేశ్వర్‌, మహిళా సంఘం రాష్ట్ర అద్యక్షురాలు జి.రాజేశ్వరి, పద్మశాలి సంఘం ప్రతినిధులు ఆర్‌.గురుచరణ్‌, బి.ప్రకాష్‌, ఎస్‌.గణేష్‌, గంగాదాస్‌, ల‌క్ష్మినారాయణ, జి.సోమయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ అనంతరం చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ డే సందర్భంగా నిజామాబాదుకు చెందిన ప్రముఖ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ డి.యాదగిరిని సన్మానించారు.

Check Also

మాక్లూర్‌లో ఐసోలేషన్‌ సెంటర్‌

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో కోవిడ్‌ బారినపడి మైల్డ్‌ సింప్టమ్స్‌ కలిగి ...

Comment on the article