Breaking News

ఆరోగ్యకర సమాజం కోసం అహర్నిశలు కృషి

నిజామాబాద్‌, జూలై 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపద్యంలో ప్రాణాల‌కు తెగించి విధులు నిర్వహిస్తున్న వైద్యుల సేవ‌లు అనిర్వచనీయమైనవని ల‌యన్స్‌ జిల్లా కార్యదర్శి పోల‌వరపు ల‌క్ష్మి అన్నారు. ల‌యన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ ఇందూర్‌ ఆద్వర్యంలో బుదవారం నిజామాబాదు నగరంలోని ల‌యన్స్‌ కంటి ఆసుపత్రిలో డాక్టర్స్‌ డే నిర్వహించారు. కార్యక్రమానికి ల‌క్ష్మి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ ఆరోగ్యకర సమాజం కోసం అహర్నిషలు కృషి చేస్తున్న వైద్యుల సేవ‌లు వెల‌కట్టలేనివన్నారు.

వైద్యులు లేని సమాజాన్ని ఊహించలేమని పేర్కొన్నారు. ల‌యన్స్‌ క్లబ్‌లు నిర్వహిస్తున్న ఆరోగ్య శిబిరాల్లో వైద్యులు ఉచిత సేవలందిస్తున్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా వైద్యులు వినోద్‌ కుమార్‌ గుప్త, డిఎల్‌ ఎన్‌ స్వామి, బాపురెడ్డి, అంకం గణేష్‌, భానుప్రియ, కొండ సంతోష్‌, ప్రవీణ్‌, శబరినాథ్‌, కిరణ్‌, తదితరుల‌ను సన్మానించారు.

కార్యక్రమంలో ల‌యన్స్‌ ఏరియా కో-ఆర్డినేటర్‌ డి.యాదగిరి, రీజియన్‌ చైర్మన్‌ అంకం ల‌క్ష్మణ్‌, పూర్వ రీజియన్‌ చైర్మన్‌ బంటు రాజయ్య, ప్రోగ్రామ్‌ చైర్మన్‌ పి.ల‌క్ష్మినారాయణ, ఇందూర్‌ క్లబ్‌ అద్యక్ష కార్యదర్శులు టి.సత్యనారాయణ, కె.రమేష్‌, కోశాధికారి గర్దాస్‌ శంకర్‌, పూర్వాద్యక్షులు గంగాదాస్‌, శివలింగం, ల‌క్ష్మినారాయణ భరద్వాజ్‌, ఆనందరావు మయ్య, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మాక్లూర్‌లో ఐసోలేషన్‌ సెంటర్‌

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో కోవిడ్‌ బారినపడి మైల్డ్‌ సింప్టమ్స్‌ కలిగి ...

Comment on the article