Breaking News

లాక్‌డౌన్‌లో కూడా జాగ్రత్తలు పాటిస్తూ వైద్యం అందించారు

నిజామాబాద్‌, జూలై 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ల‌యన్స్‌ క్లబ్‌ డైమండ్‌ ఆధ్వర్యంలో బుదవారం డాక్టర్స్‌ డే నిర్వహించారు. ఈ సందర్బంగా నిజామాబాదు నగరంలోని ఇందూరు పిల్ల‌ల‌ ఆసుపత్రి వైద్యులు యెర్ర శరత్‌ చంద్రను సన్మానించారు.

కరోనా లాక్‌ డౌన్‌ సమయంలో కూడా తగు జాగ్రత్తలు పాటిస్తూ వైద్య సేవ‌లు అందించిన డాక్టర్‌ శరత్‌ చంద్రను ల‌యన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు ధర్మరాజు అభినందించారు. క్లబ్‌ కార్యదర్శి శ్రీనివాస్‌, కోశాధికారి శ్రీధర్‌ రెడ్డి, రవికుమార్‌, తిరుమల‌ నాయుడు పాల్గొన్నారు.

Check Also

మాక్లూర్‌లో ఐసోలేషన్‌ సెంటర్‌

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో కోవిడ్‌ బారినపడి మైల్డ్‌ సింప్టమ్స్‌ కలిగి ...

Comment on the article