Breaking News

ఐదు మీటర్ల దూరం ఉండాలి

నిజామాబాద్‌, జూలై 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో మంజూరు చేసిన రైతు వేదికల‌ నిర్మాణం గురువారం సాయంత్రంలోగా మొదల‌వ్వాని నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు.

బుధవారం రోడ్లు మరియు భవనాలు, పంచాయతీ రాజ్‌ శాఖ ఇంజినీర్లతో నిర్వహించిన సెల్‌ కాన్ఫెరెన్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని 106 క్లస్టర్లకుగాను 102 క్లస్టర్లలో రైతు వేదికల‌ నిర్మాణానికి సంబంధించిన ఉత్తర్వులు జారీచేశామని, వాటి నిర్మాణం వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాల‌ని, ఇసుక కొరకు ఎటువంటి ఇబ్బందులు లేవని, అదనపు కలెక్టర్‌కు సూచనలు జారీ చేశామన్నారు.

పంచాయతీ రాజ్‌ శాఖకు సంబంధించిన రోడ్ల పక్కన చేపట్టాల్సిన అవెన్యూ ప్లాంటేషన్‌ బాధ్యత ఆ శాఖ ఏ.ఈ దేనని, పంచాయతీ రోడ్లలో మొక్కలు నాటడం, ట్రీ గార్డులు అమర్చడం శనివారం లోపు పూర్తి చేయాల‌ని, నాటే చెట్ల మధ్య ఐదు మీటర్ల దూరం ఉండాల‌ని, వచ్చే సోమవారం నుండి ప్రత్యేక అధికారులు ఆర్‌ అండ్‌ బి, పంచాయతీ రోడ్లలో నాటిన మొక్కలు తనిఖీ చేస్తారని, పూర్తిచేయని ఏ.ఈ పై చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని గ్రామాల్లో క్రిమటోరియం పనులు 15 వ తేదీ లోపు పూర్తి చేయాల‌న్నారు.

Check Also

వృత్తి నిబద్ధతకు మారుపేరు వందన కుమారి

నిజామాబాద్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వృత్తి నిబద్ధతకు మారుపేరు హిందీ పండిట్‌ వందన కుమారి ...

Comment on the article