Breaking News

Daily Archives: July 2, 2020

నివేదికలు నిర్ణీత సమయంలోగా పంపాలి

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి, జాతీయ ఉపాధి హామీ పనులు, రైతు వేదికల‌ నిర్మాణం, రైతు కల్లాల‌ నిర్మాణం, హరితహారం తదితర కార్యక్రమాల‌ను జిల్లాలో వేగవంతం చేయడానికి జిల్లా లోని 22 మండలాల‌కు జిల్లా అధికారుల‌ను స్పెషల్‌ ఆఫీసర్స్‌గా నియమిస్తూ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఆదేశాలు జారీ చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమాల‌కు సంబంధించి రోడ్లకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్‌, ప్రతి రోజూ పారిశుద్ధ్యం, డంపింగ్‌ యార్డ్‌, వైకుంఠధామాలు, ...

Read More »

ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టిఓ ఆఫీస్‌ సమీపంలో తెలంగాణ స్టేట్‌ మినరల్‌ డెవల‌ప్మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక డిపోను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ. శరత్‌ పరిశీలించారు. ఇసుక అవసరమున్న జిల్లా ప్రజలు అవకాశాన్ని వినియోగించుకోవాల‌ని కోరారు. మీ సేవ కేంద్రాల‌, ఆన్‌లైన్‌ ద్వారా ట్రాక్టర్‌ నెంబర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకుని అనంతరం ట్రాక్టర్‌ ఇసుక కోసం 4 వేల‌ 400 రూపాయలు చెల్లించాల‌ని సూచించారు. పూర్తి వివరాల‌కు సెల్‌ నెంబర్లు ...

Read More »

మొక్కల‌ సంరక్షణ బాధ్యత గ్రామ పంచాయతీల‌దే

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రహదారిపై కిలోమీటర్‌కు 1 వేయి 266 మొక్కలు ఉండే విధంగా సర్పంచులు, కార్యదర్శులు పరిశీల‌న చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అన్నారు. కలెక్టర్‌ కార్యాల‌యంలోని జనహిత హాలులో హరితహారం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో నాటిన మొక్కల‌ సంరక్షణ బాధ్యతను గ్రామ పంచాయతీల‌కు అప్పగించనున్నట్లు చెప్పారు. హైవే అధికారులు నాటిన మొక్కల‌ సంరక్షణను గ్రామ పంచాయతీల‌కు అప్పగిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల‌ ...

Read More »

అర్హత గల రైతుల‌కు పంట రుణాలు

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు కల్లాల‌ నిర్మాణం పనుల‌ను త్వరిత గతిన పూర్తి చేయాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ తెలిపారు. గురువారం స్థానిక వెల‌మ ఫంక్షన్‌ హాల్‌లో జిల్లా వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. ల‌బ్ధిదా‌రుల‌ జాబితాను ఈ నెల‌ 3 లోగా జిల్లా కేంద్రానికి పంపాల‌ని సూచించారు. ఈనెల‌ 10లోగా 20 శాతం రైతుల‌ కల్లాల‌ నిర్మాణాల‌ను పూర్తిచేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అర్హతగల‌ రైతుల‌కు పంట రుణాలు ఇప్పించాల‌ని ...

Read More »

వృద్ధుల‌కు ‘ఆల‌న’తో చికిత్స

నిజామాబాద్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆద్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా అసాంక్రమిక వ్యాధుల‌ నివారణలో భాగంగా ఆల‌న అనే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి చేతుల‌ మీదుగా గురువారం ప్రారంభించారు. కార్యక్రమం పైట్‌ ప్రాజెక్టుగా జిల్లాలో దర్పల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంగా గుర్తించి దానికి అనుబంధంగా నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల‌ను గుర్తింంచినట్టు పేర్కొన్నారు. ఈ కేంద్రాలు పిహెచ్‌సి భీంగల్‌, పిహెచ్‌సి సిరికొండ, పిహెచ్‌సి జక్రాన్‌పల్లి, పిహెచ్‌సి ఇందల్‌వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల‌లో పనిచేస్తుందన్నారు. ...

Read More »

అవ్వకు బువ్వ

ఆర్మూర్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం రక్ష స్వచ్చంద సేవ సంస్థ ఆధ్వర్యములో ‘‘అవ్వకు బువ్వ’’ కార్యక్రమములో ప్రతి నెల‌లో భాగంగా పేదల‌కు ఒక్కొక్కరికి 5 కిలోల‌ చొప్పున 47 మంది పేద వృద్దుల‌కు ఉచితంగా బియ్యం పంపిణి చేశారు. ఈ సందర్బంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్‌ ఖాందేష్‌ మాట్లాడుతూ పేద వృద్దుల‌కు తమవంతు సహకారం అందిస్తున్నామని, మానవ సేవయే మాధవ సేవ అన్నారు. రోటరీ క్లబ్‌ ఆఫ్‌ ఆర్మూర్‌ అధ్యక్షుగా ఎన్నికైన ప్రవీణ్‌ పవార్‌ని ఘనంగా ...

Read More »

సైంటిస్టుకి అరుదైన గౌరవం

డిచ్‌పల్లి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలోని వృక్షశాస్త్ర అధ్యయన శాఖలోని సైంటిస్టుకి అరుదైన గౌరవం దక్కింది. డాక్టర్‌ తాళ్ళ సాయి కృష్ణా అనే సైంటిస్టుకి డి.ఎస్‌. కొఠారి పోస్టు డాక్టోరల్‌ ఫెలోషిప్‌ వచ్చింది. తెలంగాణ యూనివర్సిటీ సైన్స్‌ డీన్‌ ప్రొఫెసర్‌ విద్యావర్ధిని పర్యవేక్షణలో మొక్కల్లో తామర పురుగు వ‌ల్ల‌ వచ్చే వ్యాధులు, రోగ నిరోధక శక్తి అనే అంశంపై పరిశోధనలు జరపటానికి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమీషన్‌ ఫెలోషిప్‌ ప్రదానం చేసింది. గతంలో కూడా ఆయనకు సెర్బ్‌ యంగ్‌ ...

Read More »

హరితహారంలో మొక్కలు నాటి నీరుపోశారు

బాన్సువాడ, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం బాన్సువాడ మండలంలో 6వ విడత హరితహారంలో భాగంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి మొక్కలు నాటి నీరుపోశారు. అలాగే రైతు వేదికల‌కు శంకు స్థాపనలు చేశారు. బాన్సువాడ మండలంలోని తాడ్కోల్‌ మరియు కొనాపూర్‌ గ్రామాల‌లో 22 ల‌క్షల‌తో నిర్మించనున్న రైతు వేదికల‌కు శంకుస్థాపన అనంతరం కొనాపూర్‌, ఖాదళాపూర్‌, హన్మజిపేట్‌ గ్రామంలో 6వ విడత హరితహారం కార్యక్రమంలో పాల్గొని పలు మొక్కలు నాటారు. కార్యక్రమములో జిల్లా రైతుబంధు ...

Read More »

హరితహారంలో మొక్కులు, రైతు వేదికల‌కు శంకుస్థాపనలు

బీర్కూర్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం బీర్కూర్‌ మండలంలోని బైరపూర్‌, బీర్కూర్‌, కిష్టాపూర్‌, చించొలి, రైతు నగర్‌ గ్రామాల‌లో 6వ విడత హరితహారం కార్యక్రమములో పాల్గొని పలు మొక్కలు నాటి, అనంతరం బైరపూర్‌ మరియు రైతు నగర్‌ గ్రామాల‌లో రైతు వేదికల‌ నిర్మాణం కోసం ఉమ్మడి జిల్లా డిసిసిబి ఛైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా రైతు బంధు అధ్యక్షుడు అంజి రెడ్డి, ఎంపీపీ రఘు, జడ్పీటీసీ స్వరూప శ్రీనివాస్‌, మండల‌ రైతు బంధు ...

Read More »