Breaking News

సైంటిస్టుకి అరుదైన గౌరవం

డిచ్‌పల్లి, జూలై 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీలోని వృక్షశాస్త్ర అధ్యయన శాఖలోని సైంటిస్టుకి అరుదైన గౌరవం దక్కింది. డాక్టర్‌ తాళ్ళ సాయి కృష్ణా అనే సైంటిస్టుకి డి.ఎస్‌. కొఠారి పోస్టు డాక్టోరల్‌ ఫెలోషిప్‌ వచ్చింది.

తెలంగాణ యూనివర్సిటీ సైన్స్‌ డీన్‌ ప్రొఫెసర్‌ విద్యావర్ధిని పర్యవేక్షణలో మొక్కల్లో తామర పురుగు వ‌ల్ల‌ వచ్చే వ్యాధులు, రోగ నిరోధక శక్తి అనే అంశంపై పరిశోధనలు జరపటానికి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమీషన్‌ ఫెలోషిప్‌ ప్రదానం చేసింది. గతంలో కూడా ఆయనకు సెర్బ్‌ యంగ్‌ సైంటిస్టు ఫెలోషిప్‌ వచ్చింది. ఈ విషయమై ప్రొఫెసర్‌ విద్యావర్దిని సంతోషం వ్యక్తం చేశారు. యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ నసీమ, వృక్షశాస్త్ర విభాగ అధిపతి డాక్టర్‌ అలీమ్‌ఖాన్‌ సాయికృష్ణను అభినందించారు.

Check Also

దరఖాస్తుల‌కు 20 జూలై చివరితేదీ

నిజామాబాద్‌, జూలై 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల‌ సందర్భంగా ఆగస్టు 15, 2020 ...

Comment on the article