Breaking News

హరితహారంలో మొక్కలు నాటి నీరుపోశారు

బాన్సువాడ, జూలై 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం బాన్సువాడ మండలంలో 6వ విడత హరితహారంలో భాగంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి మొక్కలు నాటి నీరుపోశారు. అలాగే రైతు వేదికల‌కు శంకు స్థాపనలు చేశారు. బాన్సువాడ మండలంలోని తాడ్కోల్‌ మరియు కొనాపూర్‌ గ్రామాల‌లో 22 ల‌క్షల‌తో నిర్మించనున్న రైతు వేదికల‌కు శంకుస్థాపన అనంతరం కొనాపూర్‌, ఖాదళాపూర్‌, హన్మజిపేట్‌ గ్రామంలో 6వ విడత హరితహారం కార్యక్రమంలో పాల్గొని పలు మొక్కలు నాటారు.

కార్యక్రమములో జిల్లా రైతుబంధు అధ్యక్షుడు అంజిరెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజ వెంకటరామ్డ్‌ రెడ్డి, జడ్పీటీసీ పద్మ గోపాల్‌ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్‌ సంగ్రామ్‌ నాయక్‌, తెరాస పార్టీ అధ్యక్షుడు మోహన్‌ నాయక్‌, ప్యాక్స్‌ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్‌, మండల‌ నాయకులు భూషణ్‌ రెడ్డి, దొడ్ల వెంకటరామ్‌ రెడ్డి, గోపాల్‌ రెడ్డి, ఎజాజ్‌, పాత బాల‌క్రిష్ణ, అలిముద్దీన్‌ బాబా,ఆయా గ్రామాల‌ సర్పంచులు రమణ, రాజమని రాజు, భాస్కర్‌, సుభాష్‌, ఎంపీటీసీలు, కార్యకర్తలు, అధికారులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

Check Also

వ్యాపారస్తుల‌ ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్‌

బాన్సువాడ, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీజనల్‌ వ్యాధుల‌ నివారణలో భాగంగా రాష్ట్ర పురపాల‌క శాఖ ...

Comment on the article