Breaking News

వృద్ధుల‌కు ‘ఆల‌న’తో చికిత్స

నిజామాబాద్‌, జూలై 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ ఆద్వర్యంలో నిజామాబాద్‌ జిల్లా అసాంక్రమిక వ్యాధుల‌ నివారణలో భాగంగా ఆల‌న అనే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి చేతుల‌ మీదుగా గురువారం ప్రారంభించారు. కార్యక్రమం పైట్‌ ప్రాజెక్టుగా జిల్లాలో దర్పల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంగా గుర్తించి దానికి అనుబంధంగా నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల‌ను గుర్తింంచినట్టు పేర్కొన్నారు.

ఈ కేంద్రాలు పిహెచ్‌సి భీంగల్‌, పిహెచ్‌సి సిరికొండ, పిహెచ్‌సి జక్రాన్‌పల్లి, పిహెచ్‌సి ఇందల్‌వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల‌లో పనిచేస్తుందన్నారు. ఒక వాహనం ద్వారా వైద్య బృందం అందులో ఒక డాక్టర్‌, ఒక స్టాఫ్‌ నర్సు, ఒక ఏఎన్‌ఎం బృందంగా నాలుగు ఆరోగ్య కేంద్రాల‌ను సందర్శించి 60 సంవత్సరాల‌ పైబడిన వృద్దుల‌కు దీర్ఘకాలిక వ్యాధులు ఉండి మంచం పట్టిన రోగుల‌కు వారి ఇంటి వద్దకు మెడికల్‌ బృందం వెళ్ళి తగిన పరీక్షలు చేసి తగిన మందులు ఇవ్వడం జరుగుతుందన్నారు.

కార్యక్రమంలో డిఎంఅండ్‌ హెచ్‌వో సుదర్శనం, ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ శంభు, డాక్టర్‌ భూమేశ్వర్‌, ధర్పల్లి వైద్యాధికారి, డిప్యూటి డిఎం అండ్‌ హెచ్‌వో బి.గంగాధర్‌ పాల్గొన్నారు.

Check Also

వక్ఫ్‌బోర్డు మార్గదర్శకాలు పాటించాలి

నిజామాబాద్‌, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు సూచించిన ...

Comment on the article