Breaking News

కార్మికుల వాటా తేల్చాలి

కామారెడ్డి, జూలై 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మికుల‌ హక్కుల‌ సాధనకు శుక్రవారం జాతీయ కమిటీ పిలుపుమేరకు సోదర సంఘాల‌తో నిరసన చేపట్టినట్టు ఏఐసిటియు, బిఎల్‌టియు కార్మిక సంఘాల‌ నాయకులు రాజలింగం, సదానందం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2 వ సారి అధికారం చేపట్టగానే పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు 44 రద్దు చేసి నాలుగుకోడ్లుగా రూపొందించే కుట్ర చేయడం తక్షణం మానుకోవాల‌ని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ప్రస్తుత లాక్‌ డౌన్‌ సందర్భంగా అసంఘటిత కార్మికుల‌కు ఉపాధి లేక కుటుంబాలు నడుపుకోలేని దుస్థితి ఏర్పడిరదన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం పేద ప్రజల‌ను నిర్లక్ష్యం చేస్తూ లాక్‌ డౌన్ నాలుగవ దశలో ప్రకటించిన 20 ల‌క్షల‌ కోట్ల రూపాయలు కార్మికుల‌ వాటా తేల్చాల‌ని డిమాండ్‌ చేశారు. కరోన సహాయం కింద ప్రతి అసంఘటిత రంగ కుటుంబానికి కేరళ ప్రభుత్వం ఇస్తున్న మాదిరిగా నెల‌కు 7 వేల‌ 500 ప్రతి కుటుంబానికి ఆరు నెల‌ల వరకు ఇవ్వాల‌ని డిమాండ్‌ చేశారు.

అసంఘటిత రంగ కార్మికుల‌ను ప్రభుత్వ కార్మికులుగా గుర్తించాల‌ని, కనీస వేతనాలు ఐఎల్‌వో నిర్ణయించిన విధంగా అమలు చేయాల‌న్నారు. సింగరేణి బొగ్గు గనుల‌ను ప్రైవేటుకు అప్పగించేందుకు ఆలోచన విరమించుకోవాల‌ని డిమాండ్‌ చేశారు. సొంత ఇల్లు లేని అసంఘటిత కార్మికుల‌కు, పేద ప్రజల‌కు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా తక్షణం డబుల్‌ బెడ్‌ రూమ్ ఇల్లు మంజూరు చేయాల‌ని ఆర్డీవో కార్యాల‌యంలో అసిస్టెంట్‌ అధికారికి వినతి పత్రం అందజేశారు.

కార్యక్రమంలో ఏఐసిటియు జిల్లా అధ్యక్షుడు తిరుపతి, జిల్లా ఉపాధ్యక్షుడు జబ్బర్‌, జిల్లా నాయకులు రామచంద్రం, సత్యనారాయణ, బీడీ కార్మిక సంఘం నాయకులు అలీ, రజియా, బాల‌ రాజవ్వ, పద్మ, స్వప్న తదితరులు పాల్గొన్నారు.

Check Also

వేదిక నిర్మాణాలు పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు వేదిక భవనాల‌ నిర్మాణం పనుల‌ను త్వరితగతిన పూర్తిచేయాల‌ని ...

Comment on the article