Breaking News

Daily Archives: July 4, 2020

పరిమిత వనరుల‌తో మహా శక్తిని ఢీ కొన్నాడు

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన్యం దొర అల్లూరి సీతా రామరాజు 124 వ జయంతిని పురస్కరించుకుని టీజీవిపి కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో పూల మాల‌ వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీజీవిపి రాష్ట్ర కార్యదర్శి ఏనుగందుల‌ నవీన్‌ మాట్లాడుతూ అఅల్లూ‌రి సీతారామరాజు బ్రిటిషు పాల‌కుల‌ను ఎదిరించి సాయుధ పోరాటం చేసిన మన్యం ప్రాంత విప్లవ వీరుడు అన్నారు. భారత స్వాతంత్య్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు (1897 జూలై 4 – 1924 మే 07) ఒక ...

Read More »

ప్రజా పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఐ, ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య 74 వ వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళుల‌ర్పించారు. అలాగే విప్లవ బాణం మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎల్‌.దశరథ్‌, ఏఐఎస్‌ఎప్‌ జిల్లా అధ్యక్షుడు నరేష్‌ కుమార్‌ మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య నిజాం నిరంకుశ పాల‌నకు వ్యతిరేకంగా సాగిన ప్రజా పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం అని అన్నారు. భూమి, భుక్తి, విముక్తి అనే మౌలిక ...

Read More »

భూములు గుంజుకుంటే ఉద్యమిస్తాం

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం సిపిఎం పార్టీ అద్వర్యంలో కామారెడ్డి మండలం గూడేం గ్రామంలో రైతులు సాగు చేసుకుంటున్న భూముల‌ను, ప్రభుత్వం జెండాలు పాతిన భూముల‌ను సందర్శించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకట్‌ గౌడ్‌తో పాటు జిల్లా కమిటీ సభ్యులు చంద్రశేఖర్‌, రైతుల‌తో కలిసి సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ గూడేం గ్రామంలో 49 సర్వేనెంబర్‌లో 1000 పైగా ఎకరాల‌లో 500 కుటుంబాల‌ రైతులు గత 80 సంవత్సరాలుగా 3 గ్రామాల‌కు చెందిన రైతులు సాగు ...

Read More »

వృద్ధునికి రక్తదానం

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌కు చెందిన గంగిపోగు సుబ్బయ్య 57 సంవత్సరాల‌ వయసు కలిగిన వృద్ధుడికి రక్తహీనతతో ప్రాణాపాయ స్థితిలో శ్రీ విష్ణు వైద్యశాల‌ నిజామాబాద్‌లో ఉండగా వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహాన్ని గురించి తెలుసుకొని సంప్రదించారు. నిజామాబాద్‌ కేంద్రంలో ఏబి పాజిటివ్‌ రక్తం ల‌భ్యం కాకపోవడంతో వారు కామారెడ్డి రక్తదాతల‌ నిర్వాహకుడు బాలును సంప్రదించడంతో ఆరేపల్లి గ్రామానికి చెందిన కెఆర్‌వి నరసింహము మరియు శ్రీనివాస్‌ సహకారంతో రెండు యూనిట్ల ఏబి పాజిటివ్‌ ...

Read More »

సోమవారం నుంచి ప్రారంభం

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌లో ప్రభుత్వం మంజూరుచేసిన కోవిడ్‌ 19 పరీక్ష కేంద్రం (వైరాజీ ల్యాబ్‌) లో కరోనా పరీక్షలు సోమవారం నుండి ప్రారంభించనున్నట్లు నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటన చేస్తూ ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్లో కోవిడ్‌ 19 పరీక్షలు స్థానికంగా నిర్వహించదానికి ఆమోదం ల‌భించిందని, సోమవారం నుండి రోజుకు 30 మందికి టెస్టులు నిర్వహిస్తామని, మొదట హాస్పిటల్లో అడ్మిట్‌ అయిన పేషెంట్లకు, ...

Read More »

పనుల‌ పురోగతి బాగుంది

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందల్వాయి, గన్నారంలో నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి పరిశీలించారు. శనివారం ఇందల్వాయిలో నిర్మాణంలో ఉన్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ పనుల‌ను సమీక్షించిన జిల్లా కలెక్టర్‌ పనుల‌ పురోగతి బాగుందని, అదేవిధంగా కొనసాగించి త్వరలో పూర్తి చేయాల‌ని, గ్రామంలో ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ ద్వారా ప్లాంటేషన్‌ చేసుకోవాల‌ని, గ్రామాన్ని అందంగా తీర్చి దిద్దటానికి సర్పంచులు 50 నుంచి 100 వరకు కొబ్బరి, అశోక వంటి చెట్లను నాటించాల‌ని ...

Read More »

పెంపుడు కుక్క‌ల‌కు వ్యాధి నివారణ టీకాలు

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూలై 6 వ తేదీన జరుపుకునే ‘‘ప్రపంచ జూనోసిస్‌ దినోత్సవం’’ సందర్భంగా జిల్లా కేంద్రములోని జిల్లా పశువైద్యశాల‌, కోటగల్లి, శివాజీ నగర్‌లో నిర్వహించబడుతుందని జిల్లా పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఆధికారి డా.యం.డి. బాలీగ్‌ అహ్మద్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జూనోసిస్‌ వ్యాధులో ప్రధానమైన ‘‘రేబిస్‌’’ వ్యాధి నివారణ కొరకు నగరంలోని పెంపుడు కుక్కల‌కు ఉచితంగా వ్యాధి నివారణ టీకాలు వేయడం జరుగుతుందని, కావున పెంపుడు కుక్కల‌ యజమానులు, తమ పెంపుడు కుక్కల‌కు ...

Read More »

అవకాశమున్నా ఎందుకు ఇవ్వడం లేదు

బీర్కూర్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అలాగే పూర్వ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు పెట్రోల్‌ డీజిల్ ధరల‌ అసాధారణ పెంపునకు వ్యతిరేకంగ కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ మండల‌ కేంద్రంలోని కామప్ప కూడలి వద్ద టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అబ్దుల్‌ అహ్మద్‌, జిల్లా ఎస్‌టీ సెల్‌ అధ్యక్షుడు ప్రతాప్‌ సింగ్‌ ఆధ్వర్యంలో ధర్నా, ఆటోకు తాడుతో లాగి సుమారు గంట పాటు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అబ్దుల్‌ ...

Read More »

బహుజన సమాజంపై అగ్రవర్ణాల‌ పెత్తనం

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బహుజన సమాజంపై అగ్రవర్ణాల‌ పెత్తనంపై ఎంసిపిఐయు, బిఎల్‌ఎప్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు జయప్రదం చేయాల‌ని బిఎల్‌ఎఫ్‌ రాష్ట్ర కన్వీనర్‌ సిద్దిరాంలు అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్ర కార్యాల‌యంలో శనివారం జరిగిన పత్రిక, మీడియా సమావేశానికి హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి నిజామాబాదు జిల్లాలో గ్రామాభివృద్ది కమిటీ పేరుతో బహుజన సమాజంపై సాగిస్తున్న అనాగరిక, అనధికార పెత్తనాల వ‌ల్ల‌ ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ ప్రజలు పడుతున్న అవస్థల‌ను ...

Read More »

పెంచిన ధరలు వెనక్కి తీసుకోవాలి

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పెట్రోల్‌, డీజిల్ ధరల పెంపునువ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్త ఆందోళనను చేపట్టింది. అందులో భాగంగా కామారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి, మాజీ మండలి అధ్యక్షుడు షబ్బీర్‌ అలీ ఆదేశాల‌ మేరకు పట్టణాధ్యక్షుడు పండ్ల రాజు అధ్యక్షతన పెంచిన పెట్రోల్‌ డీజిల్ ధరల‌ను వెంటనే వెనక్కి తీసుకోవాల‌ని కోరుతూ కామారెడ్డి ఆర్డీఓ కార్యాల‌యం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రం సమర్పించారు. కరోనా సంక్షోభం వెంటాడుతున్న తరుణంలో పెట్రోల్‌, డీజిల్ ధరల‌ను అనాలోచితంగా పెంచడం ...

Read More »

57 మందికి చెక్కుల‌ పంపిణీ

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 57 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 16 ల‌క్షల‌ 44 వేల‌ 500 రూపాయల‌ చెక్కులు ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 371 మందికి 2 కోట్ల 60 ల‌క్షల‌ 26 వేల‌ 800 రూపాయల‌ చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలు అనారోగ్య కారణాల వల‌న ఆసుపత్రుల్లో వైద్యం కోసం ఖర్చులు ముఖ్యమంత్రి ...

Read More »

నగరంలో మన్యం వీరుడి జయంతి

నిజామాబాద్‌, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 123వ జయంతిని నిజామాబాద్‌ నగరంలోని కోటగల్లిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్‌ దండు నీతూ కిరణ్,‌ సీతారామరాజు విగ్రహానికి పూల‌మాల‌ వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో కార్పొరేటర్‌ సిరిగారి ధర్మపురి, తెరాస నాయకులు ఆంతిరెడ్డి దేవేందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Read More »