Breaking News

ప్రజా పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం

కామారెడ్డి, జూలై 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఐ, ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య 74 వ వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళుల‌ర్పించారు. అలాగే విప్లవ బాణం మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎల్‌.దశరథ్‌, ఏఐఎస్‌ఎప్‌ జిల్లా అధ్యక్షుడు నరేష్‌ కుమార్‌ మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య నిజాం నిరంకుశ పాల‌నకు వ్యతిరేకంగా సాగిన ప్రజా పోరాటమే తెలంగాణ సాయుధ పోరాటం అని అన్నారు. భూమి, భుక్తి, విముక్తి అనే మౌలిక హక్కుల‌ కొరకు ఉద్యమించిన మహనీయుడ‌ని అన్నారు. అంతే కాకుండా తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక పోరాటాలు నిర్వహించారని దేశ ముఖ్ల‌‌ను బ్రిటిష్‌ వారికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించారని బ్రిటిష్‌ సైన్యంపై దాడి చేసి ఎదురు తిరిగారని గుర్తుచేశారు.

అలాగే మన్నెం వీరుడు అల్లూరిసీతారామరాజు విప్లవ బాణం అని, రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యంపై తిరుగు బాటు చేశారని అన్నారు. అల్లూరి సీతారామరాజు 1897 జులై 4 న విశాఖ జిల్లాలో జన్మించారని ఆయన 123 వ జయంతిని నిర్వహించినట్టు పేర్కొన్నారు. అతి చిన్న వయసులోనే ఉద్యమ బాట పడ్డాడని, అలాగే బ్రిటిష్‌ సైన్యం పై అలుపెరుగని పోరాటంలో 1924 మే 7 న తెల్ల‌ దొరల‌ తుపాకుల‌కు బల‌య్యారని అన్నారు.

వారి ఆశయాల‌ని ప్రతి ఒక్కరు కొనసాగించాల‌ని, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వీరి వర్థంతి, జయంతిలు అధికారికంగా ప్రకటించాల‌ని అన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా నాయకులు ఎస్‌ ఆర్‌ శేఖర్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకులు నర్సింలు, శివ ప్రసాద్‌ , అభిలాష్‌ తదితరులు ఉన్నారు.

Check Also

5 నుంచి 14 వరకు లాక్‌డౌన్‌

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నానాటికీ విజృంభిస్తున్నందున ...

Comment on the article