Breaking News

పరిమిత వనరుల‌తో మహా శక్తిని ఢీ కొన్నాడు

కామారెడ్డి, జూలై 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన్యం దొర అల్లూరి సీతా రామరాజు 124 వ జయంతిని పురస్కరించుకుని టీజీవిపి కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో పూల మాల‌ వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీజీవిపి రాష్ట్ర కార్యదర్శి ఏనుగందుల‌ నవీన్‌ మాట్లాడుతూ అఅల్లూ‌రి సీతారామరాజు బ్రిటిషు పాల‌కుల‌ను ఎదిరించి సాయుధ పోరాటం చేసిన మన్యం ప్రాంత విప్లవ వీరుడు అన్నారు.

భారత స్వాతంత్య్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు (1897 జూలై 4 – 1924 మే 07) ఒక మహోజ్వల‌ శక్తి అని, ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమన్నారు. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాల‌ర్పించిన యోధుడని, కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరాస్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరుల‌తో, చాలా పరిమిత వనరుల‌తో బ్రిటీషు సామ్రాజ్యమనే మహా శక్తిని ఢీకొన్నాడన్నారు.

మహానుభావుడి జయంతి సందర్భంగా ఆయన విప్లవ భావాలు స్మరించుకుంటు శత కోటి వందనాలు తెలిపారు. కార్యక్రమంలో టీజీవిపి డివిజన్‌ నాయకులు భోంపల్లి భూపాల్‌, రామకృష్ణ, బుచ్చన్న, శ్రీక‌ర్‌‌, కృష్ణ ప్రసాద్‌, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

5 నుంచి 14 వరకు లాక్‌డౌన్‌

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నానాటికీ విజృంభిస్తున్నందున ...

Comment on the article