Breaking News

రేపు సాయంత్రంలోగా మొదల‌వ్వాలి

నిజామాబాద్‌, జూలై 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో స్థల‌ సేకరణ పూర్తయిన అన్ని గ్రామాల‌లో విలేజ్‌ నేచురల్‌ పార్కుల‌కు సాంక్షన్‌ ఉత్తర్వులు తీసుకొని నిర్మాణం సోమవారం సాయంత్రం లోగా మొదల‌వ్వాని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. ఆదివారం పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులు, ఎంపిడిఓలు తదితరుల‌తో నిర్వహించిన సెల్‌ కాన్ఫెరెన్సు లో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు.

జిల్లాలోని 355 గ్రామాల‌లో విల్లేజ్‌ పార్క్ ల ‌కొరకు స్థలాల‌ను గుర్తించడం జరిగిందని, ఆయా గ్రామపంచాయతీలు మరియు మండల‌ పంచాయతీ నుండి తీర్మానాలు తెప్పించుకుని, సోమవారం లోపు మంజూరు ఉత్తర్వులు తీసుకొని పనులు మొదలుపెట్టాల‌ని, సోమవారం సాయంత్రం ఎన్నికల‌ కమిషన్‌ ఎమ్మెల్సీ ఎన్నికల‌ నిర్వహణకై నిర్ణయం తీసుకొన్నట్లయితే, మొదలుకాని పనుల‌కు ఎన్నికల‌ కోడ్‌ వర్తిస్తుందని, మనం వెనుక పడతామని, కావున జిల్లా పరిషత్‌ సీఈఓ, డీఆర్‌డివో ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టి ఎంపిడివోల‌కు మార్గనిర్దేశం చేసి సోమవారం లోగా 355 గ్రామాల‌లో విల్లేజ్‌ పార్కుల‌ నిర్మాణం మొదల‌య్యేలా చూడాల‌న్నారు.

దీనివ‌ల్ల ఎల‌క్షన్‌ కోడ్‌ వచ్చినప్పటికీ మనకు 15 రోజులు కలిసి వస్తాయని, లేబర్‌ టర్న్‌ ఔట్‌ పెరుగుతుందని, హరితహారం టార్గెట్‌ కూడా చేరుకోవచ్చన్నారు. సోమవారం పనులు ప్రారంభించడానికి ప్రోటోకాల్‌ ప్రకారం ప్రజాప్రతినిధుల‌ను ఆహ్వానించాల‌ని, పనుల‌ను అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) పర్యవేక్షించాల‌న్నారు. 530 గ్రామ పంచాయితీల‌లో వైకుంఠ దామాలు, డంపింగ్‌ యార్డులో అప్రోచ్‌ రోడ్లు, మొరం నింపడం, భూమిని చదును చేయడం వంటి పనులు జులై 15 వ తేదీలోపు పూర్తికావాల‌ని, 5 నుండి 6 సెంటీమీటర్ల వర్షం నమోదైనా ఎక్కడా నీరు నిలువకుండా మొరం నింపాల‌ని, మొరం కొరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని రెవిన్యూ అధికారుల‌కు ఆదేశాలిచ్చామని, అవసరమైన మొరంను గ్రామ పంచాయితీ ట్రాక్టర్‌ను ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ క్రింద లేబర్‌ ఉపయోగించుకొని పూర్తిచేయాల‌న్నారు.

జిల్లాలో 2020 హరితహారంలో భాగంగా 10 ల‌క్షల‌ మొక్కలు నాటినట్లయితే దాదాపు 2 వేల‌ 900 గ్రామ వన సేవకుల‌ను నియమించుకొని, వారికి ఎన్‌ఆర్‌ఇజిఎస్‌లో వాచ్‌ వార్డ్‌ క్రింద చెల్లింపు చేయవచ్చని, పంచాయతీ రాజ్‌ శాఖకు సంబంధించిన రోడ్ల పక్కన చేపట్టాల్సిన అవెన్యూ ప్లాంటేషన్‌లో మొక్కలు నాటడం, ట్రీ గార్డు అమర్చడం శనివారం లోపు పూర్తి చేయాల‌ని, నాటే చెట్ల మధ్య ఐదు మీటర్ల దూరం ఉండాల‌న్నారు.

లేబర్‌ టర్న్‌ ఔట్‌ పెంచడానికి గ్రామాల‌ మధ్య రోడ్లు, అప్రోచ్‌ రోడ్లు, ఫీల్డ్‌ ఛానళ్లకు సంబంధించిన పనులు చేపట్టేలా పక్కా ప్రణాళికను రూపొందించి, పంచాయతీ సెక్రటరీల‌ను మొటివేట్‌ చేసి పనులు పూర్తి చేయాల‌న్నారు. ఇబ్బందులు లేకుండా ఉన్న దరఖాస్తుదారుల‌కు కళ్లాల‌ నిర్మాణానికి మంజూరు ఉత్తర్వులు జారీచేయాల‌ని డీఆర్డీఓకు సూచించారు.

Check Also

రేపు విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని మిర్చి కాంపౌండ్‌ సబ్‌స్టేషన్‌ పరిదిలో గురువారం ...

Comment on the article