నిజామాబాద్, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజల ధనం వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిదని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్ ప్రగతి భవన్ సమావేశ మందిరంలో హరితహారం / ప్రభుత్వ ఆస్తులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. హరితహారం 15 జూలై నాటికి పూర్తి కావాలని, జూలై 28 నుండి 31 వరకు నాలుగు రోజులు గ్రామ పంచాయతీలో పల్లె ప్రగతిలో జరిగిన పనులపై విలేజ్ ఆడిట్ నిర్వహిస్తామన్నారు. వాచ్ ...
Read More »Daily Archives: July 6, 2020
కిట్లు రెగ్యులర్‌గా వినియోగించాలి
హైదరాబాద్, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ -19 నియంత్రణలో భాగంగా జీహెచ్ఎంసీ శానిటేషన్, ఎంటమాలజీ, డి.ఆర్.ఎఫ్ సిబ్బందికి మంత్రి కేటీఆర్ పీపీఈ కిట్స్ పంపిణీ చేశారు. ప్రస్తుతం రూ.13 కోట్ల వ్యయంతో 22 వేల మంది శానిటేషన్, 2500 మంది ఎంటమాలజీ సిబ్బందికి పీపీఈ సేఫ్టీ కిట్స్ ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. కిట్స్‌ను రెగ్యులర్‌గా వినియోగించాలని సిబ్బందికి మంత్రి సూచించారు. కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడంలో శానిటేషన్, ఎంటమాలజీ సిబ్బంది సేవలను గుర్తించి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ...
Read More »రోజుకు 30 శాంపిల్స్ టెస్ట్
నిజామాబాద్, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కోవిడ్ పరీక్ష ల్యాబ్ (వైరాజీ లాబ్) జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సోమవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా ప్రజలకు ఉపయోగపడే విధంగా కోవిడ్ పరీక్షలు స్థానికంగా నిర్వహిస్తామన్నారు. ఇప్పటివరకు ల్యాబ్‌లో అన్ని రకాల ట్రయల్స్ చేశామని, శాంపిల్స్‌ను హైద్రాబాద్‌కు పంపడం, వారు ఆమోదించి పర్మిషన్ ఇచ్చారని, సోమవారం అధికారికంగా లాబ్ ప్రారంభించామని, ట్రైనింగ్ అయిన సిబ్బంది ద్వారా రోజుకు 30 శాంపిల్స్ టెస్ట్ చేసే విధంగా చర్యలు ...
Read More »నిర్మాణ పురోగతిని ప్రతి వారం తెలపాలి
నిజామాబాద్, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొత్త కలెక్టరేట్ వెనక నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సోమవారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పురోగతిని ప్రతి వారం తెలపాలని, పనులకు ఎటువంటి అంతరాయం కలగకుండా చూడాలని, వస్తున్న వర్షపు నీటిని డ్రైన్‌కు మళ్లించి పనులు ఆగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నాగారం వద్దగ ఫేస్ టు లో ఉన్న డబుల్ బెడ్ ...
Read More »భారీగా ద్విచక్ర వాహనాలు స్వాధీనం
నిజామాబాద్, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్, అదిలాబాద్ , నిర్మల్, కామారెడ్డి జిల్లాలో ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తున్న నేరస్తున్ని పట్టుకున్నట్టు నిజామాబాద్ ఏసిపి వెల్లడిరచారు. వివరాలు ఇలా ఉన్నాయి… ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో 5 వ టౌన్ ఎస్ఐ జాన్ రెడ్డి మరియు అతని సిబ్బంది కలిసి వర్ని ఎక్స్ రోడ్డు దగ్గర పెట్రోలింగ్ చేస్తుండగా మోటార్ సైకిల్‌పై వచ్చిన ఓ వ్యక్తిని వాహన కాగితాలు అడిగారు. సదరు వ్యక్తి డాక్యుమెంట్ల గురించి సరైన ...
Read More »బిల్లు రద్దుచేసి ప్రజలను ఆదుకోవాలి
కామారెడ్డి, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులెదుర్కొంటున్నారని, ఈ పరిస్థితుల్లో అడ్డగోలుగా విద్యుత్ అధిక బిల్లులు వసూలు చేయడం సమంజసం కాదని, వెంటనే బిల్లులు రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదేశాల మేరకు సోమవారం కామారెడ్డి పట్టణంలో డిసిసి అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు అధ్యక్షతన గాంధీ చౌక్ వద్ద నిరసన చేపట్టి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ...
Read More »పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి
బీర్కూర్, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెంచిన విద్యుత్ ధరలకు వ్యతిరేకంగా టీపీసీసీ అధ్యక్షుడు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు లాక్ డౌన్ సమయంలో పెంచిన విద్యుత్ బిల్లులు మాఫీ చేసి ఆ భారం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలంటూ సోమవారం నిరసన వ్యక్తం చేశారు. టీపీసీసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అబ్దుల్ అహ్మద్, జిల్లా ఎస్టి సెల్ అధ్యక్షుడు ప్రతాప్ సింగ్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ప్రధానమైన డిమాండ్‌తో స్థానిక విద్యుత్ కేంద్రం ముందు ...
Read More »బ్యాంకు ఆవరణలో హరితహారం
బాన్సువాడ, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు కార్యాలయ ఆవరణలో ఆరో విడత హరితహారంలో భాగంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసి బ్యాంకు అధ్యక్షుడు పోచారం భాస్కర్ రెడ్డి మొక్కలు నాటి నీరుపోశారు. కార్యక్రమంలో బ్యాంక్ సీఈవో సుమమాల, డిసిఓ సింహాచలం, జీఎం లింబాద్రి, డిజిఎం గజానంద్, మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు మరియు బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
Read More »