నిజామాబాద్, జూలై 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్, అదిలాబాద్ , నిర్మల్, కామారెడ్డి జిల్లాలో ద్విచక్ర వాహనాలు దొంగతనం చేస్తున్న నేరస్తున్ని పట్టుకున్నట్టు నిజామాబాద్ ఏసిపి వెల్లడిరచారు. వివరాలు ఇలా ఉన్నాయి… ఆదివారం ఉదయం 5 గంటల సమయంలో 5 వ టౌన్ ఎస్ఐ జాన్ రెడ్డి మరియు అతని సిబ్బంది కలిసి వర్ని ఎక్స్ రోడ్డు దగ్గర పెట్రోలింగ్ చేస్తుండగా మోటార్ సైకిల్‌పై వచ్చిన ఓ వ్యక్తిని వాహన కాగితాలు అడిగారు.
సదరు వ్యక్తి డాక్యుమెంట్ల గురించి సరైన సమాధానం చెప్పకపోవడంతో అనుమానం వచ్చి గట్టిగా నిలదీశారు. తన పేరు మహమ్మద్ హైమద్ హుస్సేన్ తండ్రి బషీర్ హుస్సేన్ అని, స్వస్థలం బైంసా, నిర్మల్ జిల్లా అని, తాను నడుపుతున్న మోటార్ సైకిల్ నిజామాబాద్ ఆనంద్ నగర్లో ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా గల ఇంటి ముందు నుంచి కొన్ని రోజుల క్రితం దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నాడన్నారు. అలాగే నిజామాబాద్ లోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలోనూ మరియు ఆర్మూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్‌లో, అలాగే కామారెడ్డి పట్టణంలో కూడా మోటర్ సైకిళ్ళు దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడన్నారు.
ఇతను దాదాపు పై పోలీస్ స్టేషన్ పరిధిలో 29 మోటర్ సైకిళ్లను దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడన్నారు. అట్టి 29 మోటార్ సైకిళ్ళను స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్టు తెలిపారు. ఇతను పాత నేరస్తుడని, గతంలో కూడా ఆదిలాబాద్ మరియు నిజామాబాద్ పట్టణంలోని మూడవ టౌన్ పరిధిలోని 2018లో దాదాపు 17 మోటార్ సైకిళ్ళను దొంగతనం చేసిన కేసులో రిమాండ్ కావడం జరిగిందన్నారు.
అలాగే నాలుగు నెలల శిక్ష కూడా పడిరదని, ప్రస్తుతం అతను బెయిల్‌పై ఉన్నాడన్నారు. ఇట్టి నేరాలలో మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడంలో కృషిచేసిన సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్ జాన్ రెడ్డి, ఏఎస్ఐ షకీల్, కానిస్టేబుల్ వేణుగోపాల్, చంద్ర శేఖర్, అప్సర్‌ను ఏసీపీ నిజామాబాద్ శ్రీనివాస్ కుమార్ అభినందించారు.

Nizamabad News

Latest posts by Nizamabad News (see all)
- సీతారామ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలి - January 21, 2021
- పెండింగ్ ముటేషన్లు త్వరగా పూర్తిచేయాలి - January 21, 2021
- ఫిబ్రవరి 1 నుంచి తరగతులు ప్రారంభం - January 21, 2021