Breaking News

ప్రజా ధనం వృధా కాకుండా చూడాలి

నిజామాబాద్‌, జూలై 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల ధనం వృధా కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిదని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో హరితహారం / ప్రభుత్వ ఆస్తుల‌పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. హరితహారం 15 జూలై నాటికి పూర్తి కావాల‌ని, జూలై 28 నుండి 31 వరకు నాలుగు రోజులు గ్రామ పంచాయతీలో పల్లె ప్రగతిలో జరిగిన పనుల‌పై విలేజ్‌ ఆడిట్‌ నిర్వహిస్తామన్నారు.

వాచ్‌ అండ్‌ వార్డ్‌ ప్లాంటేషన్‌ సిస్టమేటిక్‌గా ఉండాల‌ని, మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించుకునేందుకు దాదాపు 2 వేల‌ 900 గ్రామ వన సేవకుల‌ను నియమించుకోవడం జరిగిందని, ప్రతి రోజు ఉదయం 7 నుంచి 9 పారిశుద్ధ్య పనులు, 9 నుండి వాచ్‌ అండ్‌ వార్డ్‌ పనులు చేయించాల‌న్నారు.మున్సిపాలిటీలో జరిగే విధంగా గ్రామాల‌లో డోర్‌ టు డోర్‌ చెత్త సేకరణ జరగాల‌న్నారు. రి సైకిల్‌ డంపింగ్‌ యార్డ్‌లో జరగాల‌ని, ప్రతి గ్రామంలో రెండు వేల‌ మొక్కలు నాటే విధంగా చర్యలు తీసుకోవాల‌ని, వన సేవకుల‌కు రెండు గంటలు అదనంగా పనిచేసినందుకు డబ్బు ఇస్తున్నామన్నారు.

వైకుంఠ దామం, పార్కు జూలై 15 వరకు పూర్తి కావాల‌ని, క్రిమటోరియంలో వాటర్‌ సప్లై, వైఫై, పవర్‌ సప్లై ఉండే విధంగా చర్యలు తీసుకోవాల‌ని, వైకుంఠధామంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ద్వారా గ్రావెల్‌ ఫీల్‌ చేయాల‌న్నారు. 348 విలేజ్‌ పార్కు శాంక్షన్‌ చేసుకున్నామని, జిపిలో ప్రతి కుటుంబానికి ఉపయోగపడే విధంగా ఉండాల‌ని, డోనర్స్‌ తో ఫ్రీజర్‌, వైకుంటరథం సమకూర్చుకునే విధంగా చూడాల‌ని, మున్సిపాలిటీల‌లో పట్టణ ప్రగతిలో నిర్మించుకునే పబ్లిక్‌ టాయిలెట్స్‌ పనులు, అవిన్యూ ప్లాంటేషన్‌ జూలై 15 వరకు పూర్తి కావాల‌న్నారు. గ్రీన్‌ బడ్జెట్‌ ద్వారా ఐదు వందల‌ నుండి 1000 మొక్కలు కొనాల‌ని మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు.

రైతు వేదికలు 48 గంటల్లో 106 గ్రౌండ్‌ అయినట్లు తెలిపారు. హరితహారం శాఖల‌ వారీగా ఇచ్చిన టార్గెట్‌ జూలై 15వ తేదీ వరకు పూర్తి చేయాల‌ని, పట్టణ ప్రగతిలో పనులు వేగంగా జరగాల‌ని, యాదాద్రి మోడల్‌ ప్లాంటేషన్‌ పూర్తి కావాల‌న్నారు. పూర్తయిన శాఖలు లొకేషన్‌ వారిగా డాటా ఇవ్వాల‌న్నారు. ప్రభుత్వ ప్రాపర్టీస్‌ వచ్చే సోమవారం వరకు పూర్తి చేయాల‌ని శాఖల‌ వారిగా రివ్యూ నిర్వహించారు.

ప్రభుత్వ ప్రాపర్టీస్‌ మున్సిపాలిటీలో ఉన్నవి మున్సిపాలిటీ ప్రాపర్టీ రిజిస్టర్‌లో జిపిలో ఉన్నవి జిపి ప్రాపర్టీ సర్వేనెంబర్‌ ఉన్నవాటికి రెవిన్యూ శాఖ ద్వారా ఉండాల‌న్నారు. మున్సిపాలిటీ లిమిట్స్‌, జిపి లిమిట్స్‌లో ఉన్న వాటికి సర్టిఫికేషన్‌ తీసుకోవాల‌న్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ల‌త, చంద్రశేఖర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌ వి పాటిల్‌, డిఆర్‌డివో రమేష్‌ రాథోడ్‌ సంబంధిత శాఖల‌ అధికారులు పాల్గొన్నారు.

Check Also

రేపు విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని మిర్చి కాంపౌండ్‌ సబ్‌స్టేషన్‌ పరిదిలో గురువారం ...

Comment on the article