Breaking News

రోజుకు 30 శాంపిల్స్‌ టెస్ట్‌

నిజామాబాద్‌, జూలై 6

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో కోవిడ్‌ పరీక్ష ల్యాబ్‌ (వైరాజీ లాబ్‌) జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సోమ‌వారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ జిల్లా ప్రజల‌కు ఉపయోగపడే విధంగా కోవిడ్‌ పరీక్షలు స్థానికంగా నిర్వహిస్తామన్నారు. ఇప్పటివరకు ల్యాబ్‌లో అన్ని రకాల‌ ట్రయల్స్‌ చేశామని, శాంపిల్స్‌ను హైద్రాబాద్‌కు పంపడం, వారు ఆమోదించి పర్మిషన్‌ ఇచ్చారని, సోమవారం అధికారికంగా లాబ్‌ ప్రారంభించామని, ట్రైనింగ్‌ అయిన సిబ్బంది ద్వారా రోజుకు 30 శాంపిల్స్‌ టెస్ట్‌ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

వారం పది రోజుల్లో కెపాసిటీని 100 పరీక్షలు నిర్వహించే విధంగా రివ్యూ చేస్తూ ముందుకు వెళ్తామన్నారు. ల్యాబ్‌లో పరీక్షలు రోజు రోజు పెంచుతూ సుమారుగా మూడు వందల‌ నుండి 500 పరీక్షలు చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. జీజీహెచ్‌, ఏరియా పిహెచ్‌సిల్లో ల‌క్షణాలు ఉన్న వారిని ముందుగా పరీక్షించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

పాజిటివ్‌ వచ్చిన వారికి ప్రైమరీ కాంటాక్ట్‌ ఉన్న వారిని గుర్తించి, వారిలో ల‌క్షణాలు ఉన్నవారికి, అనుమానితుల‌ను పరీక్షించే విధంగా శాంపిల్‌ సేకరిస్తారని, పాజిటివ్‌ వచ్చిన పేషెంట్‌కు మంచి చికిత్స అందించే విధంగా చర్యలు తీసుకుంటామని, అదే విధంగా డిజిహెచ్‌ నుండి కోఆర్డినేషన్‌ పక్కాగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.

చికిత్స అయిన తర్వాత పర్యవేక్షణ ఉండాల‌ని, రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నందున ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరిస్తూ కరోనాను ఎదుర్కొనే విధంగా ముందుకు వెళ్లాల‌న్నారు. కలెక్టర్‌ వెంబడి జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ నాగేశ్వరరావు, డిఈ రాజేశ్వర్‌ తదితరులున్నారు.

Check Also

ఆఫీసుకు పబ్లిక్‌ రావటాన్ని తగ్గించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్‌ ...

Comment on the article