Breaking News

Daily Archives: July 7, 2020

పిట్లంలో కరోనా

కామారెడ్డి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిట్లం మండల‌ కేంద్రంలో ఒకరికి కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయినట్టు అధికారులు వెల్ల‌డిరచారు. దీంతో బుధవారం 8వ తేదీ నుంచి పిట్లం వ్యాపారాస్తులు స్వచ్చందంగా లాక్‌డౌన్‌ ప్రకటించుకున్నారు. ఈ విషయమై సర్పంచ్‌ జొన్నల‌ విజయల‌క్ష్మి శ్రీనివాస్‌రెడ్డి పిట్లం వ్యాపారస్తుల‌కు ధన్యవాదాలు తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలందరు సహకరించాల‌ని కోరారు. అలాగే చుట్టుపక్కల‌ గ్రామాల‌ ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప పిట్లం రావద్దని సూచించారు. పిట్లం వాసులందరు ఎవరింట్లో వారు ఉండాల‌న్నారు.

Read More »

లోన్లు రికవరీ చేయడం కూడా అంతే ముఖ్యం

నిజామాబాద్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌లో బాంకర్లతో జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అగ్రిక‌ల్చ‌ర్‌ లోన్లు, కోవిడ్‌ లోన్లు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలోన్ల పై మాట్లాడారు. అగ్రిక‌ల్చ‌ర్‌ లోన్ల శాతం తక్కువగా ఉన్నదని, దీనిని పెంచి రైతుల‌కు సకాలంలో ఉపయోగపడేలా చూడాల‌న్నారు. అదే విధంగా కోవిడ్‌ లోన్‌తో పాటు మరి కొన్ని ప్రభుత్వ లోన్లు కొన్ని బ్యాంకులు ఇవ్వడం లేదని, లేదా అతి తక్కువగా ఇస్తున్నారని బ్యాంకుల‌ వారీగా సమీక్షించారు. ...

Read More »

రూ. 2 వేలు ఆర్థిక సాయం

కామరెడ్డి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిబిపేట్‌ మండలంలోని మహమ్మద పూర్‌ వాసురాలైన పిట్ల పద్మ గత వారం రోజుల‌ క్రితం గుండెనొప్పితో మరణించడం జరిగింది. కాగా మంగళవారం అఖిల‌ భారతీయ ప్రజా సేవ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ జిల్లా ఇంచార్జ్‌ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్యామ్‌ రావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. రూ. 2 వేల‌ నగదు ఆర్థిక సాయం చేశారు. కుటుంబానికి భవిష్యత్తులో అండగా ఉంటామని మనోధైర్యాన్ని కోల్పోవద్దని ధైర్యంగా ...

Read More »

ఆ రెండు క‌ల్లు దుకాణాల‌తో కష్టాలు

నిజామాబాద్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగర ప్రజల‌కు అసౌకర్యం కలిగిస్తున్న క‌ల్లు దుకాణం ఇక్కడి నుండి తొల‌గించి మరోచోటకు మార్చాల‌ని 7 వ వార్డు కార్పొరేటర్‌ సుక్కమధు జిల్లా కలెక్టర్‌కు మంగళవారం విన్నవించారు. నగర నడిబొడ్డున రెండవ, మూడవ క‌ల్లు దుకాణాల వ‌ల్ల‌ ఇక్కడి మహిళలు, విద్యార్థులు, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన కలెక్టర్‌కు వివరించి వినతి పత్రం సమర్పించారు. నిత్యం రాకపోకలు కొనసాగించే ముఖద్వారం ఇరువైపులా ఉండడం వల‌న కాల‌నీలోకి వెళ్లే తమకు ముఖ్యంగా విద్యార్థుల‌పై ...

Read More »

దుబ్బాకలో మాడల్‌ వైకుంఠధామం

నిజామాబాద్‌, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్పల్లి మండలం, దుబ్బాక గ్రామంలో జరుగుతున్న వైకుంఠ దామం, కంపోస్ట్‌ షెడ్‌, విల్లేజి పార్క్‌ పనుల‌ను మంగళవారం జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనికీ చేశారు. అనంతరం మాట్లాడుతూ దుబ్బాక గ్రామపంచాయతీ మాడల్‌ వైకుంఠధామానికి ఎంపికైన గ్రామమని, పనులు వేగంగా జరగాల‌న్నారు. మండలంలో మాడల్‌ వైకుంఠధామం కావాలంటే శ్రద్ధగా, గట్టిగా పనిచేయాల‌న్నారు. వైకుంఠధామం పూర్తయిన తర్వాత మండలంలోని గ్రామ పంచాయతీ సర్పంచుకు చూపించి, ఇక్కడే మీటింగ్‌ ఏర్పాటు చేస్తామని, వైకుంఠ ...

Read More »

రక్తనిల్వ‌లు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

కామారెడ్డి, జూలై 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రక్తదాతల‌ సమూహం పిలుపు మేరకు మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల‌ బ్లడ్‌ బ్యాంకులో రక్తదాన శిబిరం నిర్వహించినట్టు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదాన కేంద్రంలో రక్త నిలువ‌లు లేకపోవడంతో గర్భిణీ స్త్రీలు ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారని తమకు తెల‌పడంతో శిబిరం ఏర్పాటు చేశామన్నారు. కరోనా వైరస్‌ కారణంగా రక్తదానం చేయడానికి ముందుకు రాకపోవడంతో రక్త నిలువ‌లు తగ్గిపోయాయని, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ...

Read More »