Breaking News

రూ. 2 వేలు ఆర్థిక సాయం

కామరెడ్డి, జూలై 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిబిపేట్‌ మండలంలోని మహమ్మద పూర్‌ వాసురాలైన పిట్ల పద్మ గత వారం రోజుల‌ క్రితం గుండెనొప్పితో మరణించడం జరిగింది. కాగా మంగళవారం అఖిల‌ భారతీయ ప్రజా సేవ సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ జిల్లా ఇంచార్జ్‌ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకం శ్యామ్‌ రావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

రూ. 2 వేల‌ నగదు ఆర్థిక సాయం చేశారు. కుటుంబానికి భవిష్యత్తులో అండగా ఉంటామని మనోధైర్యాన్ని కోల్పోవద్దని ధైర్యంగా ఉండాల‌ని సూచించారు. కుటుంబాన్ని కలిసిన వారిలో కమిటీ కామారెడ్డి జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు మోతే లావణ్య ఉన్నారు.

Check Also

వేదిక నిర్మాణాలు పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు వేదిక భవనాల‌ నిర్మాణం పనుల‌ను త్వరితగతిన పూర్తిచేయాల‌ని ...

Comment on the article