కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు ప్రభుత్వం స్వచ్ఛ తెలంగాణ -స్వచ్ఛ 2వ వార్డ్‌లో ప్రవేశపెట్టిందని అడ్లూర్‌లో కౌన్సిలర్ సూతరి రవి అన్నారు. 2వ వార్డులో తడి, పొడి చెత్త బుట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తడి చెత్తను, పొడి చెత్తను వేర్వేరుగా వేయాలని, వాటిని ప్రతి ఉదయం వచ్చే చెత్త బండ్లలో వేయాలన్నారు. తడి, పొడి చెత్త ఒకే వద్ద వేయకుండా ప్రభుత్వం ఇంటింటికీ రెండు చెత్త బుట్టలను ఉచితంగా అందిస్తుందన్నారు. ...
Read More »Daily Archives: July 10, 2020
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి
కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని సీపీఐ నాయకులు ఆర్డివో కార్యాలయం ముందు నిరసన తెలిపి అనంతరం డిప్యూటీ తహసీల్దార్ ఉమాలతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎల్.దశరథ్ మాట్లాడుతూ కరోన విస్తరిస్తున్న సందర్భంగా కరొన వైరస్ చికిత్సను ఆరోగ్యశ్రీ లో చేర్చాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా రాష్ట్రంలో కామారెడ్డి జిల్లాలో ప్రవేట్, కార్పొరేట్, ఆసుపత్రులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ప్రజలకు చికిత్స అందించాలన్నారు. పెట్రోల్, ...
Read More »24 వరకు వందశాతం పూర్తికావాలి
నిజామాబాద్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కలెక్టరేట్ ప్రగతి భవన్లో ఎంపిడివోలు మరియు ఏపీఓలతో ఎన్ఆర్ఇజిఎస్ పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరితహారంలో నాటే మొక్కలు 5 మీటర్లకు ఒక్క మొక్క ఉండేలా చూడాలని, సంవత్సరం తరువాత చూస్తే అందంగా కనపడాలని, నాటిన ప్రతి మొక్కా బతకాలని, ప్రతి గ్రామంలో అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా కనీసం 2 వేల మొక్కలు పెట్టాలని, దర్పల్లిలో చాలా బాగా చేశారని, ...
Read More »దోమకొండలో కరోనా
కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు 26 పాజిటివ్ కేసులు నమోదైనట్టు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కామారెడ్డి – 14, చిన్న మల్లారెడ్డి -1, బాన్సువాడ-5, పిట్లం -1, దోమ కొండ-1 పోచారం (నాగిరెడ్డిపేట మండలం)-1, గాంధారి -2, మాచారెడ్డి-1 పాజిటివ్ కేసులు నమోదైనాయన్నారు. 127 శాంపిల్సుకు గాను నెగెటివ్ రిపోర్ట్స్ 101 వచ్చాయని, పాజిటివ్ కేసులు 26 నమోదైనట్టు ...
Read More »ఘన్పూర్ యువకుల రక్తదానం
డిచ్పల్లి, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కల్లెడ గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళకు గర్భసంచి విషయమై నిజామాబాద్ నగరంలోని తేజ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కాగా ఆపరేషన్ నిమిత్తం ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో డిచ్పల్లి మండలం గన్‌పూర్‌కు చెందిన యువకులు స్పందించారు. పివైఎల్ నాయకులు సాయినాథ్, ప్రేమ్‌కుమార్ ఇద్దరు యువకులు రక్తం అందించి లక్ష్మి ప్రాణాలు కాపాడారు. వీరిని ఆసుపత్రి సిబ్బంది, బాధిత మహిళ బంధువులు అభినందించారు.
Read More »ప్రజా సేవకు ఎల్లప్పుడూ సిద్ధం
నిజామాబాద్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మృతిచెందిన ముగ్గురు కోవిడ్ 19 పేషెంట్ల మృతికి డాక్టర్లు, నర్సులు లేదా పారా మెడికల్ సిబ్బంది నిర్లక్ష్యం గాని, ఆక్సిజన్ కొరత గాని కారణం ఎంతమాత్రం కాదని జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ గురువారం నిజామాబాద్ జిల్లాలో మృతిచెందిన ముగ్గురిలో ఒకరు జాక్రాన్ పల్లి గ్రామానికి చెందిన 75 సంవత్సరాల వయసున్న మహిళ అని, తీవ్రమైన అస్వస్థతకు ...
Read More »రక్తదానం
కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండలం చిన్న పోతంగల్‌కు చెందిన దర్గోభ అక్షిత 13 సంవత్సరాల వయసు కలిగిన విద్యార్థిని సాయి సింహ వైద్యశాలలో రక్త హీనతతో బాధపడుతుండడంతో వారికి ఏ పాజిటివ్ రక్తం అవసరమైంది. వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించడంతో గంప ప్రసాద్ సహకారంతో పట్టణానికి చెందిన తోడుపునూరి శ్రీనివాస్ వి.టి ఠాకూర్ బ్లడ్ బ్యాంకులో ఏ పాజిటివ్ రక్తం అందించి ప్రాణాలు కాపాడారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు ...
Read More »35వ డివిజన్లో చక్కగా మొక్కలు నాటారు
నిజామాబాద్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హరితహారం కార్యక్రమంలో భాగంగా నగరంలోని 35వ డివిజన్ నాందేవ్వాడలో నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ మొక్కలు నాటి నీరుపోశారు. మైదానమంత వరుస క్రమంలో చక్కగా మొక్కలు నాటారు. మేయర్ వెంట కమిషనర్ జితేష్.వి. పాటిల్, కార్పొరేటర్ మాస్టర్ శంకర్, మున్సిపల్ ఇంజినీర్ ఆనంద్ సాగర్, ఏ.ఇ. శంకర్, అలీం, సునీల్ ఇతర సిబ్బంది ఉన్నారు.
Read More »గర్భిణీలకు పోషకాహారం పంపిణీ
నందిపేట్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం నందిపేట మండలం షాపురు గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో గర్భిణీలకు స్థానిక మూడు గ్రామాల ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల రాణిమురళి పోషక ఆహారాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణీలకు ప్రభుత్వం ఇస్తున్న పోషక ఆహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కరోన వ్యాధి నేపథ్యంలో గర్భిణీలు బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని తప్పనిసరిగా బయటకు వెళ్ళాల్సి వస్తే మాస్కులు ధరించాలని ఎంపిటిసి మద్దుల రాణి చెప్పారు. కార్యక్రమంలో జిల్లా విద్య, క్రీడల ...
Read More »సంకల్పం అందరిని ముందుకు తీసుకెళుతుంది
డిచ్పల్లి, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎం.పి. జొగినపల్లి సంతోష్ కుమార్ సంకల్పించిన ‘‘గ్రీన్ చాలెంజ్’’ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ఆచార్య ఆర్. లింబాద్రి తెలంగాణ విశ్వవిద్యాయంలో 500 మొక్కలు నాటే లక్ష్యంతో గురువారం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎం. పి. జొగినపల్లి సంతోష్ కుమార్ ‘‘గ్రీన్ చాలెంజ్ – గ్రీన్ ఇండియా’’ కార్యక్రమం దేశంలోనే గొప్ప స్ఫూర్తిని నింపుతుందని, ఈ సంకల్పం ...
Read More »అప్రమత్తంగా ఉండి అన్ని చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ మహమ్మారి అతి వేగంగా విస్తరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లా యంత్రాంగం ముఖ్యంగా వైద్య మరియు రెవెన్యూ శాఖకు చెందిన అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్ తన చాంబర్లో వైద్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాలో కూడా రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయని, ప్రణాళికా బద్ధంగా మనం ముందుకు వెళ్ళితే దానిని కట్టడి చేయగలుగుతామన్నారు. జిల్లా ఆసుపత్రిలో టెస్టులు ...
Read More »పనులు గుర్తించడంలో వెనకబడి ఉన్నారు
నిజామాబాద్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్, ఇర్రిగేషన్, ఎడ్యుకేషన్, ట్రైబల్ వెల్ఫేర్ తదితర శాఖలకు సంబంధించి ఎన్ఆర్ఇజిఎస్ క్రింద చేపట్ట గలిగే అన్నిపనులకు సంబంధించిన ఎస్టిమేట్లు తయారు చేసి, సాంక్షన్ ఆర్డర్స్ తీసుకుని, వెంటనే పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు ఆదేశాలు జారీచేశారు. గురువారం జిల్లాలోని రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్, ఇర్రిగేషన్, గిరిజన సంక్షేమం, విద్యా శాఖ ఇంజనీరింగ్ అధికారులతో నిర్వహించిన సెల్ కాన్ఫెరెన్సులో మాట్లాడారు. ఇర్రిగేషన్ శాఖకు ...
Read More »