నిజామాబాద్, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యవసాయ రంగమే కాదు ఏ రంగమైనా మనసుపెట్టి పనిచేస్తే మంచి విజయం లభిస్తుందని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అన్నారు. బుధవారం నాబార్డ్ ఆధ్వర్యంలో 39వ ఆవిర్భావ దినోత్సవం జిల్లా స్థాయిలో ప్రగతి భవన్లో ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో నిజామాబాద్ మొదటి స్థానంలో ఉందని, వడ్లు కొనుగోళ్లలో మొదటి లేదా రెండో స్థానంలో ఉన్నామన్నారు. మన జిల్లాలో ...
Read More »Daily Archives: July 15, 2020
నిజామాబాద్‌లో 13 కోవిడ్ పాజిటివ్
నిజామాబాద్, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం నిజామాబాద్ జిల్లాలో 13 కోవిడ్ కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. యమ్. సుదర్శనం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫలితాలు వచ్చిన శాంపిల్స్ 49 నెగెటివ్ రిపోర్ట్ 33 నమోదైన పాజిటివ్ కేసులు 13 నమోదైన మరణాలు 4 పంపిన శాంపిల్స్ 69 ఫలితాలు రావాల్సిన శాంపిల్స్ 69 వైద్య శాఖ సిబ్బంది తగు నియంత్రణ చర్యలు చేపట్టారని, కానీ ప్రజల సహకారం లేనిదే ...
Read More »కామారెడ్డిలో నేడు 21 పాజిటివ్ కేసులు
కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి బుధవారం సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 21 పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. పాజిటివ్ కేసుల వివరాలు : కామారెడ్డి – 5 బాన్సు వాడ – 3 భిక్నూర్ – 2 గాంధారి -1 నాగి రెడ్డి పేట – 2 పిట్లం – 5 బీర్కూర్ ...
Read More »వైద్యం అందక ప్రాణాలు వదులుతున్నారు
కామారెడ్డి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ వైఫ్యలం ప్రభుత్వ నిర్లక్ష్యంతో అమాయక ప్రజలు పిట్టల్లా రాలుతున్నారని మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ఆందోళన వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. కరోనా పాజిటివ్ ఉన్న నిండు గర్భిణీ పురిటి నొప్పులతో నరక యాతన అనుభవించి తల్లి, పాప మృతి చెందారని, కామారెడ్డి పట్టణంలో ఇస్లాంపూర కాలనికి చెందిన ఒకే కుటుంబంలో ఏడుగురికి కరోనా పాజిటివ్ రావడం జరిగిందన్నారు. అందులో ...
Read More »కార్మికులకు శిక్షణ
నిజామాబాద్, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రకృతి వైపరీత్యాల (డిజాస్టర్ మెనేజ్ మెంట్) సమయంలో పని చేసేవిధంగా కార్మికులకు నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ శిక్షణ ప్రారంభించారు. మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కెటిఆర్ అదేశాలమేరకు ప్రతి నగరపాలక సంస్థలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండటానికి పని చేసేవిధంగా సిబ్బందికి శిక్షణ ఇచ్చి ఎటువంటి పరిస్థితుల్లో అయిన నగర ప్రజలకు సేవలు అందించే విదంగా అగ్నిమాపక సిబ్బందితో కలిసి పని చేయటానికి ఉత్సాహవంతులైన కార్మికులకు ...
Read More »21 వరకు ఫీజు గడువు పెంపు
డిచ్పల్లి, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని అనుబంధ కళాశాలలలోని పీజీ ఎం.ఎ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.బి.ఏ., ఎం.సి.ఏ., ఐ.ఎం.బి.ఏ., ఎల్.ఎల్.ఎం., ఎల్.ఎల్.బి., బి.ఎల్.ఐస్సీ కోర్సులో గల రెండవ, నాలుగవ, ఆరవ, ఎనిమిదవ, పదవ సెమిస్టర్ రెగ్యూలర్ మరియు బ్యాక్ లాగ్ థియరీ అండ్ ప్రాక్టికల్ పరీక్ష ఫీజు గడువు ఈ నెల జూలై 21వ తేదీ వరకు పెంచబడిరదని పరీక్షల నియంత్రణాధికారి డా. ఘంటా చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు పరీక్షా ...
Read More »పనితనం బాగుంటే ఉపయోగంలోకి తెస్తాం
నిజామాబాద్, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ కలెక్టరేట్లో బుష్ కట్టర్‌ను జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ పంచాయతీల్లో బుషెస్ కట్ చేయటానికి బుష్ కట్టర్ ఉపయోగకరంగా ఉంటుందన్నారు. శ్రీలక్ష్మి వెంకటేశ్వర ఎంటర్ ప్రైజెస్ వారు జిల్లా కలెక్టర్‌కు కలెక్టరేట్లో బుష్ కట్టర్ వాడకం మరియు పనితీరును వివరించారు. బుష్ కట్టర్ టు హెచ్ పి, టు స్టోకు ఇంజిన్ కలిగి ఉంటుందని, పెట్రోల్ ప్లస్ ఆయిల్‌తో నడుస్తుందని, ఒక లీటర్ ...
Read More »నిర్మాణ పనుల పర్యవేక్షణకు అధికారులను నియమించాలి
నిజామాబాద్, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పట్టణ ప్రగతి, రైతు వేదికల నిర్మాణం, మునిసిపాలిటీలో నూతనంగా చేర్చిన గ్రామ పంచాయతీ అభివృద్ధి తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పిఎస్ మాట్లాడుతూ, మునిసిపల్ చట్టం మునిసిపాలిటీలో నూతనంగా చేర్చిన గ్రామాలలో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి కోసం అవకాశం కల్పిస్తుందన్నారు. జిల్లా కలెక్టర్లు ఈ పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలన్నారు. మునిసిపాలిటీలలో పారిశుధ్య కార్యక్రమాలపై, వెక్టర్ బార్న్ ...
Read More »రేపటి నుండి దక్షిణాయనం ప్రారంభం
దక్షిణాయనం అంటే ఏంటీ ఖగోళ శాస్త్రం ప్రకారం జనవరి 15 నుంచి జూలై 15 వరకు ఉత్తరాయణం, జూలై 16 నుంచి జనవరి 14 వరకు దక్షిణాయనం అని అంటారు. దక్షిణాయనంలో పిండ ప్రదానాలు , పితృ తర్ఫణాలు చేయడం, సాత్వికాహారం ఫలితాన్నిస్తాయి. సూర్య గమణాన్నిబట్టి మన భారతీయుల కాలాన్నిరెండు భాగాలుగా విభజించారు. భూమధ్యరేఖకు ఉత్తరదిశలో సూర్యుడు కనిపిస్తే ఉత్తరాయణమని, దక్షిణంగా సంచరించినప్పుడు దక్షిణాయమని అన్నారు. ఏడాదిలో 6 నెలలు ఉత్తరాయణం, 6 నెలలు దక్షిణాయనం. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం. కర్కాటక రాశిలోకి ...
Read More »