Breaking News

Daily Archives: July 17, 2020

పనులు నాణ్యతతో చేయాలి

నిజాంసాగర్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని అచ్చంపేట గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక పనుల‌ను పంచాయతీ రాజ్‌ డిఈ విజయ్‌ కుమార్‌ పనుల‌ను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ పనుల‌ను నాణ్యతతో చేపట్టాల‌ని కాంట్రాక్టర్లకు సూచించారు. ఆయన వెంట సర్పంచ్‌ అనసూయ సత్యనారాయణ, ఎంపీటీసీ చాకలి సుజాత రమేష్‌ కుమార్‌, పంచాయతీ రాజ్‌ ఏఈ మారుతి ఉన్నారు.

Read More »

మాగిలో చెత్త బుట్టల‌ పంపిణి

నిజాంసాగర్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మాగి గ్రామపంచాయతీ కార్యాల‌యంలో గ్రామస్తుల‌కు గ్రామ సర్పంచ్‌ కమ్మరి కత్త అంజయ్య, పంచాయతీ కార్యదర్శి ల‌క్ష్మన్‌లు కలిసి చెత్త బుట్టలు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్‌ మాట్లాడుతూ గ్రామస్తులు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకూడదని, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాల‌ని సూచించారు. కార్యక్రమంలో నాయకులు కమ్మరి కత్త సాయిలు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు.

Read More »

కామారెడ్డిలో 12 కోవిడ్‌ పాజిటివ్‌

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో గురువారం సాయంత్రం 5 గంటల‌ నుంచి శుక్రవారం సాయంత్రం 5 గంటల‌ వరకు మొత్తం 12 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాజిటివ్‌ కేసుల‌ వివరాలు : బాన్సు వాడ – 5 పెద్ద కొడపగల్‌ -1 ఎల్లా రెడ్డి – 4 జుక్కల్‌ -1 (నిజామాబాదు) నసురుల్లాబాద్‌ -1 శుక్రవారం జిల్లా నివేదిక : జిల్లాలో ...

Read More »

జిల్లా వాసికి అరుదైన గౌరవం

నిజామాబాద్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు జిల్లా వాసికి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ ల‌యన్స్‌ క్లబ్స్‌ మల్టిపుల్‌ కౌన్సిల్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌గా జిల్లా వాసి వీరేశం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ల‌యన్స్‌ క్లబ్‌లో 22 సంవత్సరాలుగా వివిధ హోదాలో సేవలందిస్తున్న నిజామాబాదు నగరానికి చెందిన ఇరుకుల‌ వీరేశంకు అత్యున్నత పదవి ల‌భించింది. తెలంగాణ రాష్ట్రంలోని ఐదువందల‌ పైచిలుకు క్లబ్‌ల‌‌‌కు ప్రాతినిధ్యం వహించే అరుదైన అవకాశం దక్కింది. అంతర్జాతీయ ల‌యన్స్‌ క్లబ్‌ మల్టిపుల్‌ కౌన్సిల్‌ వైస్‌ చైర్మన్‌గా వీరేశం ...

Read More »

నిజామాబాద్‌లో 16 కరోనా కేసులు

నిజామాబాద్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నిజామాబాద్‌ జిల్లాలో 16 కోవిడ్‌ కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. యమ్‌. సుదర్శనం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫలితాలు వచ్చిన శాంపిల్స్‌ 136 నెగెటివ్‌ రిపోర్ట్‌ 120 నమోదైన పాజిటివ్‌ కేసులు 16 నమోదైన మరణాలు 1 పంపిన శాంపిల్స్‌ 76 ఫలితాలు రావాల్సిన శాంపిల్స్‌ 76 వైద్య శాఖ సిబ్బంది తగు నియంత్రణ చర్యలు చేపట్టారని, కానీ ప్రజల‌ సహకారం లేనిదే ...

Read More »

ఐదు మీటర్ల దూరం ఉండేలా చూడాలి

నిజామాబాద్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరిత హారంలో భాగంగా మాక్లూర్‌ మండలం చిన్నా పూర్‌ నర్సరీలో జిల్లా కలెక్టర్‌ సి సి.నారాయణరెడ్డి మొక్కలు నాటి నీరుపోశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్‌ పర్యటనలో భాగంగా చిన్నాపూర్‌ నర్సరీలో మొక్కలు నాటిన అనంతరం చిన్న పూర్‌ రోడ్డు నుండి ఆర్మూర్‌ వరకు జాతీయ రహదారికి ఇరువైపుల‌ ఏవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా నాటిన 3 వేల‌ 500 మొక్కల‌ను పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మర్రి, వేప, చింత, ఫెల్‌ టొఫా, రావి, ...

Read More »

చిట్టి చేతుల‌తో మొక్కల‌కు నీరు

నిజాంసాగర్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలంలోని హసన్‌ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి ఇంటికి ఐదు మొక్కల‌ చొప్పున పంపిణీ చేశారు. కాగా శుక్రవారం మొక్కల‌కు నీరుపోస్తున్న చిన్నారులు కనిపించారు. మొహమ్మద్‌ ధీషన్‌, మొహమ్మద్‌ ఈషన్లు కలిసి ప్రతి శుక్రవారం వాటరింగ్‌ డే సందర్భంగా నీటిని పోయడం జరుగుతుందన్నారు. హరితహారంలో ఇంటి వద్ద నాటిన మొక్కల‌ సంరక్షణ పకడ్బందీగా చేస్తామన్నారు.

Read More »

ల‌క్ష్యం మేరకు చేపల ‌ఉత్పత్తి సాధించాలి

నిజామాబాద్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి తన పర్యటనలో భాగంగా మెండోరా మండలం పోచంపాడులోని చేపల‌ ఉత్పత్తి కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ సంవత్సరం మన జిల్లాకు ఇచ్చిన చేపల‌ ఉత్పత్తి టార్గెట్‌ సాధించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. చేపల‌ ఉత్పత్తి కేంద్రంలో చేపల‌ ఉత్పత్తిని పరిశీలించారు. ఫిష్‌ ఫారంలో చేపల‌ ఉత్పత్తి చేసే నర్సరీల‌ను, బ్రీడర్‌ పార్ట్‌ని, కొత్తగా నిర్మాణంలో ఉన్న చైనీస్‌ హాచరీ, ల్యాబ్‌, ...

Read More »

18న ఈ ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల‌ 18వ తేదీ మూడవ శనివారం నిజామాబాద్‌ పట్టణ‌ విద్యుత్‌ ఉపకేంద్రం వద్ద నెల‌వారి మరమ్మతులు చేస్తున్నట్టు సంబంధిత అధికారి అశోక్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9 గంటల‌ నుంచి సాయంత్రం 4 గంటల‌ వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని, విద్యుత్‌ వినియోగదారులు విషయాన్ని గమనించి సహకరించాల‌ని కోరారు.

Read More »

మొక్కలు నాటిన ఎమ్మెల్యే

కామారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరవ విడత హారితహరం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 12 వార్డు దేవునిపల్లిలో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జాహ్నవి మొక్కలు నాటి నీరుపోశారు. కార్యక్రమంలో పట్టణ తెరాస నాయకులు, కౌన్సిల‌ర్లు పాల్గొన్నారు.

Read More »