Breaking News

కామారెడ్డిలో 12 కోవిడ్‌ పాజిటివ్‌

కామారెడ్డి, జూలై 17

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో గురువారం సాయంత్రం 5 గంటల‌ నుంచి శుక్రవారం సాయంత్రం 5 గంటల‌ వరకు మొత్తం 12 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

పాజిటివ్‌ కేసుల‌ వివరాలు :
బాన్సు వాడ – 5
పెద్ద కొడపగల్‌ -1
ఎల్లా రెడ్డి – 4
జుక్కల్‌ -1 (నిజామాబాదు)
నసురుల్లాబాద్‌ -1

శుక్రవారం జిల్లా నివేదిక :
జిల్లాలో శుక్రవారం నమోదైన పాజిటివ్‌ కేసులు : 12
శుక్రవారం వరకు మొత్తం పాజిటివ్‌ కేసులు : 236
ఆక్టీవ్‌ కేసులు – 180
డిశ్చార్జి అయిన కేసులు – 52
ఇప్పటి వరకు మొత్తం మరణాలు – 4
ఇట్టి పాజిటివ్‌లో ఇప్పటి వరకు మొత్తం వల‌సదారులు : 18
శుక్రవారం వల‌స దారులు -1
శుక్రవారం పంపిన శాంపిల్స్‌ : 182
(బాన్సు వాడ ఏరియా ఆసుపత్రి నుండి – 138, కామారెడ్డి జిల్లా ఆసుపత్రి నుండి – 0, ఎల్లా రెడ్డి – 44 )

వైద్య శాఖ సిబ్బంది తగు నియంత్రణ చర్యలు చేపట్టారని, కానీ ప్రజల‌ సహకారం లేనిదే కరోన నియంత్రణ సాధ్యం కాదని, ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ అత్యంత జాగ్రత్తగా వుండాల‌ని, ఇంకొన్ని రోజుల‌ పాటు ప్రయాణాలు, ఫంక్షన్లకు, విందుల‌కు దూరంగా వుంటూ సామాజిక దూరం పాటిస్తూ, స్వచ్చందంగా ప్రజలు లాక్‌డౌన్‌ నియమాలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాల‌ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి తెలిపారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇట్టి కేసుల‌ పట్ల అప్రమత్తంగా వుండి ఎప్పటికప్పుడు తగు చర్యలు చేపడుతున్నారని, కనుక జిల్లా ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రభుత్వానికి తగు సహకారం అందించాల‌న్నారు.

Check Also

టీజీవిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విద్యార్థి పరిషత్‌ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ...

Comment on the article