Breaking News

ఒక్కరోజే 49 పాజిటివ్‌ కేసులు

నిజామాబాద్‌, జూలై 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం నిజామాబాద్‌ జిల్లాలో 49 కోవిడ్‌ కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.యమ్‌. సుదర్శనం ఒక ప్రకటనలో తెలిపారు.

శనివారం కోవిడ్‌ కేసుల జిల్లా నివేదిక

ఫలితాలు వచ్చిన శాంపిల్స్‌ 170

నెగెటివ్‌ రిపోర్ట్‌ 128

నమోదైన పాజిటివ్‌ కేసులు 49

నమోదైన మరణాలు 1

పంపిన శాంపిల్స్‌ 51

ఫలితాలు రావాల్సిన శాంపిల్స్‌ 51

వైద్య శాఖ సిబ్బంది తగు నియంత్రణ చర్యలు చేపట్టారని, కానీ ప్రజల‌ సహకారం లేనిదే కరోన నియంత్రణ సాధ్యం కాదని, ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ అత్యంత జాగ్రత్తగా వుండాల‌ని, ఇంకొన్ని రోజుల‌ పాటు ప్రయాణాలు, ఫంక్షన్లకు, విందుల‌కు దూరంగా వుంటూ సామాజిక దూరం పాటిస్తూ, స్వచ్చందంగా ప్రజలు లాక్‌డౌన్‌ నియమాలు పాటిస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాల‌ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి తెలిపారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఇట్టి కేసుల‌ పట్ల అప్రమత్తంగా వుండి ఎప్పటికప్పుడు తగు చర్యలు చేపడుతున్నారని, కనుక జిల్లా ప్రజలు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రభుత్వానికి తగు సహకారం అందించాల‌న్నారు.

Check Also

నిజామాబాద్‌ జిల్లా నూతన కమిటీ

నిజామాబాద్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా శుక్రవారం ...

Comment on the article