Breaking News

రక్త నిలువ‌లు తగ్గిపోయాయి

కామారెడ్డి, జూలై 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి వి.టి.ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో ఏ పాజిటివ్‌ మరియు బి పాజిటివ్‌ రక్త నిలువ‌లు తగ్గిపోవడం జరిగిందని, వివిధ రకాలైన ఆపరేషన్ల నిమిత్తమై రక్తం దొరకకపోవడంతో గర్భిణీ స్త్రీలు తీవ్రమైన ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నారని కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కాగా ఏ మరియు బి పాజిటివ్‌ రక్తం కలిగిన రక్తదాతలు ఆదివారం ఉదయం 10:30 గంటల‌ నుండి 1:00 వరకు వి.టి. ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకుకు రాగల‌రని విజ్ఞప్తి చేశారు. రక్తదానం చేసిన రక్త దాతల‌కు ప్రశంస పత్రం అందజేయడం జరుగుతుందని, మరిన్ని వివరాల‌కు 9492874006 నెంబర్‌లో సంప్రదించాల‌ని బాలు అన్నారు.

Check Also

టీజీవిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విద్యార్థి పరిషత్‌ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ...

Comment on the article