నిజామాబాద్, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం నిజామాబాద్ జిల్లాలో 29 కోవిడ్ కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సుదర్శనం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం కోవిడ్ కేసుల జిల్లా నివేదిక ఫలితాలు వచ్చిన శాంపిల్స్ 71 నెగెటివ్ రిపోర్ట్స్ 46 నమోదైన పాజిటివ్ కేసులు 29 నమోదైన మరణాలు ఇద్దరు కోవిడ్ వల్ల ఇతర కారణాల వల్ల నలుగురు పంపిన శాంపిల్స్ 54 ఫలితాలు రావాల్సిన శాంపిల్స్ 54 వైద్య శాఖ సిబ్బంది ...
Read More »Daily Archives: July 19, 2020
గాంధారి లాక్ డౌన్
గాంధారి, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోజు రోజుకి కరోన మహమ్మారి విస్తరిస్తున్నందున గాంధారిలో చాలా పాజిటివ్ కేసులు నమోదై ఉన్నాయని, ఇంకా పాజిటివ్ కేసులు వస్తూనే ఉన్నాయని గాంధారి గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం జరిగిన సమావేశంలో గాంధారి నిత్యావసరాల వస్తువుల దుకాణ సముదాయాల వారు, వర్తక వాణిజ్య సంఘాల వారు స్వతహాగా గాంధారి పాలకవర్గంతో పాటు గ్రామాభివృద్ధి కమిటీతో కలిసి పలు తీర్మానాలు చేశారు. దుకాణ సముదాయాలు జూలై 21వ తేదీ ...
Read More »ఇన్చార్జి ఎంపీడీవోగా వెంకటేశం
నిజాంసాగర్, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండల పరిషత్ కార్యాలయంలో ఇన్చార్జ్ ఎంపీడీవోగా జి వెంకటేశం బాధ్యతలు చేపట్టారు. ఆయన లింగంపేట మండలంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తుండగా నిజాంసాగర్ బదిలీపై ఇంచార్జి ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలందరూ కరోన మహమ్మారి నుంచి జాగ్రత్తలు వహించాలని, ప్రతి ఒక్కరూ అత్యవసర పరిస్థితిలో తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు.
Read More »అగ్రవర్ణాలపై పోరుకు సిద్ధం కావాలి
కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బహుజన లెఫ్ట్ ఫ్రంట్, ఎం సిపిఐ యు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బిఎల్ఎఫ్ కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి బిఎల్ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్, రాష్ట్ర కన్వీనర్ సిద్ధిరాములు, ఎం సిపిఐ యు జిల్లా కార్యదర్శి రాజలింగం, బిఎల్ఎఫ్ జిల్లా కన్వీనర్ సదానందం, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వెంకట్ గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు శాప శివ రాము, ...
Read More »ఆన్లైన్లో గళం విప్పండి
కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ నియంత్రణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కామారెడ్డి డిసిసి అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావు అన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు ఆన్లైన్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రాష్ట్రం కరోనా టెస్టుల్లో లాస్ట్, పాజిటివ్ పర్సెంట్‌లో ఫస్ట్ అని ఎద్దేవా చేశారు. కరోనా వైద్య సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని, ...
Read More »మానవత్వానికి ప్రతీకలు రక్త దాతలు
కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్ బ్లడ్ బ్యాంకులో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు మాట్లాడుతూ లాక్ డౌన్ నుండి రక్తం సకాలంలో దొరకక పోవడంతో గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతున్నారని, వారికి సకాలంలో రక్తాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ నెలలో రెండవసారి రక్తదాన శిబిరాన్ని నిర్వహించామన్నారు. 25 మంది యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం ...
Read More »వినతలు డబ్బాలో వేయాలి
నిజామాబాద్, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అర్జీలు సమర్పించడానికి అధికారుల వద్దకు వెళ్లవద్దని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేసారు. ఆదివారం జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రద్దు చేసినట్టు, ప్రజలు తమ వినతులు, అర్జీలు రాతపూర్వకంగా సమర్పించేందుకు కలెక్టరేట్ ఆవరణంలో ఒక ...
Read More »