Breaking News

Daily Archives: July 20, 2020

నోటరీ అడ్వకేట్‌గా ఆనంద్‌

ఆర్మూర్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణానికి చెందిన గటడి ఆనంద్‌ కేంద్ర ప్రభుత్వ నోటరీ అడ్వకేట్‌గా నియామకం అయ్యారు. కేంద్ర న్యాయ శాఖ అదనపు కార్యదర్శి అంజు అతీరాన ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అడ్వకేట్‌గా 14 సంవత్సరాల‌ నుండి ప్రజల‌కు సేవలందిస్తున్న ఆనంద్‌ సమాచార హక్కు చట్టం జిల్లా కన్వీనర్‌గా కొనసాగుతున్నారు. మరియు నోటరీ అడ్వకేట్‌గా సేవ‌లు అందిస్తామని ఆయన తెలిపారు.

Read More »

24 గంటల్లో సంజాయిషీ తెల‌పాలి

కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా పంచాయతీ అధికారి నరేశ్‌ తనకు తెలియకుండా, తన అనుమతి లేకుండా జిల్లాలోని కొంతమంది గ్రామపంచాయతీ సర్పంచుల‌కు నోటీసులు జారీ చేయడంపై కామరెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌ నోటీస్‌లోకి తీసుకురాకుండా, అనుమతి లేకుండా వైకుంఠధామం, ఇతర పనుల‌కు సంబంధించి పనులు చేయడం లేదని జిల్లాలోని కొంత మంది గ్రామ సర్పంచుల‌కు కొత్తగా వచ్చిన జిల్లా పంచాయతీ అధికారి నరేశ్‌ నోటీసులు జారీ చేయడం సీరియస్‌గా ...

Read More »

మీ ప్రవర్తన వ‌ల్ల‌ యూనియన్‌కు చెడ్డపేరు వస్తుంది

కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో సోమవారం సిరిసిల్ల‌ రోడ్డులో ఆంజనేయ కిరాణం షాప్‌ తెరుచుకొని సరుకులు అమ్ముతున్నట్టు సమాచారం తెలిసింది. వెంటనే కామారెడ్డి కిరాణా వర్తక సంఘం యూనియన్‌ అధ్యక్షుల‌తో పాటు సభ్యులు వెళ్ళి షాపు యజమాని వినయ్‌తో మాట్లాడారు. కిరాణ షాప్‌లో అడ్డగోలుగా ధరలు పెంచి అమ్ముతున్నారని ప్రజల‌ ఫిర్యాదు చేశారన్నారు. కావున దుకాణం మూసి ఉంచాల‌ని, మీ లాంటి వారి వ‌ల్ల‌ యూనియన్‌కు చెడ్డ పేరు వస్తుందని హెచ్చరించారు. అలాగే యూనియన్‌లో ఐక్యత ...

Read More »

జనావాసాల్లో సంచరించరాదు

ఎల్లారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోజు రోజుకి కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో నివారించేందుకు 24 గంటలు వైద్యులు, నాయకులు అందుబాటులో ఉంటారని ఎల్లారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌ సత్యనారాయణ అన్నారు. వైరస్‌ బారిన పడిన బాధితుల‌ కోసం హోమ్‌ క్వారంటైన్‌ ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే సురేందర్‌ గారు, జిల్లా కలెక్టర్‌ శరత్‌తో, డీఎంహెచ్‌ఓ అధికారుల‌తో సోమవారం చరవాణిలో మాట్లాడారు. పాజిటివ్‌ వచ్చిన బాధితులు జనావాసాల్లో సంచరించరాదని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రవీంద్ర మోహన్‌ తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్‌ు ...

Read More »

కోవిడ్‌ చికిత్సకు ల‌యన్స్‌ క్లబ్‌ భవనం

నిజామాబాద్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జెడ్పి చైర్మన్‌ దాదన్న గారి విట్టల్‌ రావు, జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డితో కలిసి సోమవారం మాధవనగర్‌ హైదరాబాద్‌ బై పాస్‌ రోడ్డులో గల ల‌యన్స్‌ క్లబ్‌ వారి ల‌యన్స్‌ భవనాన్ని కోవిడ్‌-19 పాసిటివ్‌ వారికి చికిత్స నిమిత్తం పరిశీలించారు. కాగా ల‌యన్స్‌ క్లబ్‌ వారు అట్టి భవనాన్ని ఉచితంగా ఇవ్వడానికి ముందుకు రావడంతో ఈ విషయమై క్లబ్‌ సభ్యుల‌తో చర్చించారు. దీనికి వారు స్వచ్చందంగా ముందుకు వచ్చారు. అట్టి భవనాన్ని ...

Read More »

పనులు నాణ్యతతో చేపట్టాలి

ఆర్మూర్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని మామిడిపల్లి 24 వ వార్డ్‌లో జరుగుతున్న సీసీ డ్రైన్ల నిర్మాణ పనుల‌ను మున్సిపల్‌ ఛైర్‌ పర్సన్‌ పండిథ్‌ వినీత పవన్‌, స్థానిక కౌన్సిల‌ర్‌ ఆకుల‌ రాముతో కలిసి పరిశీలించారు. జరుగుతున్న పనుల‌పై సంతృప్తి వ్యక్తం చేసిన ఆమె పనుల‌ను నాణ్యతతో చేయాల‌ని కాంట్రాక్టర్‌కు సూచించారు. అనంతరం మామిడిపల్లి నూతనంగా ఎన్నికైన గ్రామ అభివృద్ధి కమిటీ వారు ఛైర్‌పర్సన్‌ వినీత పవన్‌ని, కౌన్సిల‌ర్లు ఆకుల‌ రాము, కవిత కాశిరం, రవిగౌడ్‌, ...

Read More »