Breaking News

కోవిడ్‌ చికిత్సకు ల‌యన్స్‌ క్లబ్‌ భవనం

నిజామాబాద్‌, జూలై 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జెడ్పి చైర్మన్‌ దాదన్న గారి విట్టల్‌ రావు, జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డితో కలిసి సోమవారం మాధవనగర్‌ హైదరాబాద్‌ బై పాస్‌ రోడ్డులో గల ల‌యన్స్‌ క్లబ్‌ వారి ల‌యన్స్‌ భవనాన్ని కోవిడ్‌-19 పాసిటివ్‌ వారికి చికిత్స నిమిత్తం పరిశీలించారు. కాగా ల‌యన్స్‌ క్లబ్‌ వారు అట్టి భవనాన్ని ఉచితంగా ఇవ్వడానికి ముందుకు రావడంతో ఈ విషయమై క్లబ్‌ సభ్యుల‌తో చర్చించారు.

దీనికి వారు స్వచ్చందంగా ముందుకు వచ్చారు. అట్టి భవనాన్ని జెడ్పి చైర్మన్‌తో పాటు జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి, జెడ్పిటిసి సభ్యులు బాజిరెడ్డి జగన్‌ పరిశీలించారు. వారి వెంట ల‌యన్స్‌ క్లబ్‌ చైర్మన్‌ ఇరుకుల‌ వీరేశం, కోశాధికారి యాదగిరి ప్రతినిధులు కరిపె రవీందర్‌, ల‌క్ష్మీనారాయణ తదితరులున్నారు.

Check Also

నిజామాబాద్‌ జిల్లా నూతన కమిటీ

నిజామాబాద్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా శుక్రవారం ...

Comment on the article