Breaking News

కోవిడ్‌-19 జాగ్రత్తల‌పై విస్తృత ప్రచారం

కామారెడ్డి, జూలై 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ పి. చంద్రశేఖర్‌ సూచనల‌ను అనుసరించి జిల్లా మాస్‌ మీడియా అధికారులు కామారెడ్డి పట్టణంలో విస్తృతంగా కోవిడ్‌ 19 నివారణకు, నియంత్రణ తీసుకోవల‌సిన జాగ్రత్తలు మైక్‌ ద్వారా ప్రచారం చేసారు. కోవిడ్‌ 19 సోకి ఇంట్లోనే ఐసోలాషన్‌ పూర్తిగా కోలుకొనే వరకు ఆరోగ్య శాఖ అధికారులు అవసరమైన వైద్య సల‌హాలు, అవసరమైన మందులు అందచేయబడుతుందన్నారు.

హోమ్‌ ఐసోలాషన్‌ జాగ్రత్తలు తప్పక పాటించాల‌ని తెలిపారు. ప్రచారంలో డిప్యూటి డిఇఎంఓ నాగరాజు, సంజీవరెడ్డి, ఎం.రాణి పాల్గొన్నారు. కామారెడ్డిలో కాకతీయ కాల‌ని, ఎస్‌ఎస్‌ఎస్‌ఆర్ కాల‌నీ, ఎన్‌జివోస్‌, విద్యానగర్‌, కస్సబుగాలీ, ఇస్లాంపూర్‌, గొల్ల‌వాడ, అయ్యప్ప కాల‌నీ, సైలోనై కాల‌నీ, రాజీవనగర్‌, సిరిసిల్లా రోడ్‌, రామరెడ్డి రోడ్‌లో ప్రచారం చేశారు.

Check Also

టీజీవిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విద్యార్థి పరిషత్‌ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ...

Comment on the article