Breaking News

50 పడకలు సిద్ధం చేయాలి

నిజామాబాద్‌, జూలై 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ న్యాల్కల్‌ రోడ్‌లోగల‌ ఈఎస్‌ఐ హాస్పిటల్‌ను బుధవారం జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో కరోనా పాసిటీవ్‌ వచ్చిన వారికి చికిత్స అందించటానికి 50 పడకలు మరియు అవసరమైన డ్రగ్స్‌ అతి త్వరలో ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్లో ముందు ముందు కరోనా పేషెంట్లు ఎక్కువయితే ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో చికిత్స అందించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల‌న్నారు. హాస్పిటల్‌లో విద్యుత్తు, ప్లంబింగ్‌, వాటర్‌ సప్లై, పార్టిషన్‌ పనులు పూర్తయి ఉన్నవని, 50 బెడ్లు ఏర్పాటు చేయాల‌ని టిఎస్‌ ఎండి ఎస్‌ ఇంజనీర్‌ నుండి ఆదేశించారు. పర్యటనలో కలెక్టర్‌ వెంట జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ నాగేశ్వరరావు, ఈఎస్‌ఐ సూపరింటెండెంట్‌ సావిత్రి, టిఎస్‌ ఎండి ఎస్‌ ఇంజనీర్‌ ప్రవీణ్‌ తదితరులున్నారు.

Check Also

నిజామాబాద్‌ జిల్లా నూతన కమిటీ

నిజామాబాద్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా శుక్రవారం ...

Comment on the article