Breaking News

రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి

నిజామాబాద్‌, జూలై 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా విజృంభిస్తోందని, జిల్లాలో కేసులు పెరుగుతున్నాయని, దీనికి తగ్గట్లు ప్రజలు రోగనిరోధక శక్తి పెంచుకునేలా అవగాహన కల్పించాల‌ని, ప్రజలు భయపడ రాదని, అలాగే అజాగ్రత్తగా అస్సలు ఉండరాదన్న విషయాల‌పై ప్రజల్లో ప్రత్యేకంగా అవగాహన కల్పించాల‌ని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారుల‌కు సూచించారు.

మంగళవారం జిల్లాలోని వైద్య అధికారులు, ఆర్డీవోలు, ఎంపిడివోలు, ఎంపిఒల‌తో నిర్వహించిన సెల్‌ కాన్ఫెరెన్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అన్ని రకాల‌ సౌకర్యాలు కల్పించామని, వైద్యుల‌కు భద్రతా ప్రమాణాలు పెంచామని, ఇక ప్రజల్లో కరొనా వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవల‌సిన చర్యలు, భయాన్ని తొల‌గించడం, రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు అవసరమైన ఆహారపు అల‌వాట్లు తదితర విషయాల‌పై ప్రచారం చేయాల‌ని, ముఖ్యంగా కరపత్రాలు, ఫ్లెక్సీలు, మౌఖిక సంభాషణ ద్వారా ప్రచారం చేయాల‌ని, వ్యాప్తి నివారణ చర్యలు, వచ్చిన తరువాత తీసుకోవల‌సిన జాగ్రత్తలు, మాస్కులు ధరించడం, సానిటైజర్‌లు ఉపయోగించడం, భౌతిక దూరం పాటించడంపై అవగాహన కల్పించాల‌ని, ఈ విషయాల‌పై గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారులంతా చర్యలు తీసుకోవాల‌ని, మాస్కులు ధరించని వారికి, భౌతిక దూరం పాటించని వారికి జరిమానాలు విధించాల‌ని, వ్యాధి ల‌క్షణాలు ఉన్నవారికి మాత్రమే టెస్టులు చేయాల‌న్నారు.

ల‌క్షణాలు ఉన్న వారికి హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి పాటించవల‌సిన జాగ్రత్తలు వివరించాల‌ని, వారికి వైద్యాధికారులు ప్రతి రోజు ఫోన్‌ చేసి కౌన్సెలింగ్‌ చేయాల‌ని, పై విషయాల‌పై డాక్టర్లకు ట్రైనింగ్‌ కార్యక్రమాలు నిర్వహించాల‌ని అన్నారు. గ్రామ పంచాయితీ వర్కర్లతో సహా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాల‌ని అన్నారు.

Check Also

నిజామాబాద్‌ జిల్లా నూతన కమిటీ

నిజామాబాద్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా శుక్రవారం ...

Comment on the article