Breaking News

అవసరమున్న రోగుల‌కు అందివ్వాలి

నిజామాబాద్‌, జూలై 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెడ్‌ క్రాస్‌ సంస్థకు సంబంధించిన కొత్త అంబులెన్స్‌ వాహనాన్ని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి ప్రారంభించారు. బుధవారం కలెక్టరేట్‌ ప్రాంగణంలో రెడ్‌ క్రాస్‌ కొత్త అంబులెన్స్‌ను రిబ్బన్‌ కత్తిరించి ప్రారంభించిన అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. అంబులెన్స్‌తో ప్రజల‌కు మరింత చేరువ కావాల‌ని, రక్తదానం క్యాంపులు నిర్వహించి, సేకరించిన రక్తాన్ని అవసరమున్న రోగుల‌కు అందివ్వాల‌ని తెలిపారు.

రెడ్‌క్రాస్‌ మిగులు డబ్బుతో అంబులెన్స్‌ వాహనం కొనుగోలు చేసినందుకు కలెక్టర్‌ జిల్లా రెడ్‌ క్రాస్‌ సభ్యుల‌ను అభినందించారు. అంబులెన్స్‌ జిల్లాలో బ్లడ్‌ డొనేషన్‌ క్యాంపులు ఎక్కడ నిర్వహించినా అక్కడినుండి బ్లడ్‌ బ్యాంకుకు బ్లడ్‌ తీసుకురావడానికి ఉపయోగ పడుతుందన్నారు. కార్యక్రమంలో రెడ్‌ క్రాస్‌ చైర్మన్‌ డాక్టర్‌ నీలి రామ్‌ చందర్‌, కార్యదర్శి ఆంజనేయులు, కోశాధికారి రవీందర్‌, రాష్ట్ర రెడ్‌ క్రాస్‌ ఈసీ మెంబర్‌ తోట రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిజామాబాద్‌ జిల్లా నూతన కమిటీ

నిజామాబాద్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా శుక్రవారం ...

Comment on the article