Breaking News

రీ సైక్లింగ్‌ దినచర్యగా సాగాలి

నిజామాబాద్‌, జూలై 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పారిశుధ్యం, అవెన్యూ ప్లాంటేషన్‌ రెండూ సరైన రీతిలో నిర్వహించినప్పుడే పంచాయతీ సెక్రెటరీల‌కు మరియు మండల‌ అధికారుల‌కు మంచి పేరు వస్తుందని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. గురువారం పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులు, ఎంపిడివోలు, ఎంపీవోలు, పంచాయతీ సెక్రెటరీల‌తో నిర్వహించిన సెల్‌ కాన్ఫెరెన్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు.

గ్రామాల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్ల పక్కన నాటిన మొక్కల‌ను పరిరక్షించే బాధ్యత గ్రామ వన సేవకుల‌దేనని, పంచాయతీ సెక్రెటరీలు వారిని పర్యవేక్షించాల‌ని, ఒక్క మొక్క కూడా చనిపోకుండా చూడాల‌ని అలాగే వారితో గ్రామ పారిశుధ్య పనికూడా రెండు గంటల‌పాటు చేయించాల‌ని, గ్రామ పారిశుధ్యత ప్రతి రోజు మున్సిపాలిటీలో మాదిరిగా జరగాల‌ని, లేని పక్షంలో ఎంపీవోలు బాధ్యత వహించాల్సి ఉంటుందని, డ్రైనేజీలో సీల్డ్‌తోపాటు కాగితాలు, ప్లాస్టిక్‌ వస్తువులు ఏవీ ఉండరాదని, కంపోస్టును ఎరువుగా మార్చటం, చెత్తను రీసైక్లింగ్‌ చేసుకోవడం దినచర్యగా సాగాల‌ని, పారిశుధ్య పనులు ఉదయం పూర్తిచేయాల‌ని జిల్లా కలెక్టర్‌ అన్నారు.

పారిశుద్ధ్య కార్మికుల‌కు, గ్రామ వన సేవకుల‌కు అవసరమైన ఏప్రాన్లు, షూస్‌ తదితర సామాగ్రి అంతా సమకూర్చాల‌ని, ఆగస్ట్‌ 1వ తేదీ లోపు అన్ని గ్రామ పంచాయితీలోని డంప్‌ యార్డులో సెగ్రిగేషన్‌ పని మొదల‌వ్వాల‌ని, ప్లాస్టిక్‌, రబ్బర్‌ వంటి వస్తువులు రీసైక్లింగ్‌కు పంపాల‌ని, ప్రతి ఇంటినుండి తడి పొడి చెత్తను విడివిడిగా సేకరించాల‌ని ఆదేశించారు.

Check Also

రేపు విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని మిర్చి కాంపౌండ్‌ సబ్‌స్టేషన్‌ పరిదిలో గురువారం ...

Comment on the article