Breaking News

సీనియర్‌ కాంగ్రెస్‌ నేత వెంకులు మృతి

నిజామాబాద్‌, జూలై 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, ఐఎన్‌టియుసి అధ్యక్షుడు వెంకులు మృతి అత్యంత బాధాకరమని మాజి ఎంపి మధుయాష్కీ గౌడ్‌ విచారం వ్యక్తం చేశారు. వెంకులు మృతి కాంగ్రెస్‌ పార్టీకీ, వ్యక్తిగతంగా తనకు తీరని లోటని అన్నారు.

తను రాజకీయాల‌కు రాకమునుపే వెంకులు మంచి మిత్రుడని, రాజాకీయాల‌కు వచ్చిన నుండి ప్రతి ఎన్నికలో తనతో ఉంటూ తన గెలుపునకు అహర్నిశలు కృషి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఐఎన్‌టియుసి నేతగా కార్మికుల‌ హక్కుల‌ కోసం అలుపెరగని పోరాటం చేశారని, అలాగే బీసీ ఉద్యమ నాయకుడిగా ఉంటూ బీసీల‌ కోసం వెంకులు చేసిన కృషి మరువలేమని ఈ సందర్భంగా వెంకులు సేవల‌ను కొనియాడారు.

వెంకులు పవిత్ర ఆత్మకు శాంతి కల‌గాల‌ని భగవంతుని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యుల‌కు దేవుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాల‌ని కోరుకుంటున్నాని వెల్ల‌డిరచారు.

Check Also

రేపు విద్యుత్‌ అంతరాయం

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలోని మిర్చి కాంపౌండ్‌ సబ్‌స్టేషన్‌ పరిదిలో గురువారం ...

Comment on the article