Breaking News

జిల్లా ప్రజల‌కు కలెక్టర్‌ విజ్ఞప్తి

నిజామాబాద్‌, జూలై 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ శాఖల‌కు సంబంధించి ప్రజలు తమ సమస్యలు, ఫిర్యాదులు జిల్లా అధికారుల‌కు అందజేసే ప్రజావాణి కార్యక్రమాన్ని కరోన విజృంభన దృష్ట్యా రద్దు చేయటం జరిగిందని అందుకు ప్రత్యామ్నాయంగా ప్రజలు తమ ఫిర్యాదును ఫోన్‌ ద్వారా కానీ సోషల్‌ మీడియా ద్వారా కానీ ఆన్‌లైన్‌ ద్వారా కానీ సమర్పించటానికి 8 మంది అధికారుల‌ను నియమించడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి తెలిపారు.

శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటన ద్వారా జిల్లా ప్రజలు ఫోన్‌ ద్వారా తమ ఫిర్యాదుల‌ను సమర్పించడానికి ల్యాండ్‌ లైన్‌ నంబర్లు, వాట్సప్‌ ద్వారా సమర్పించడానికి వాట్సప్‌ నంబర్లు, ఈ-మెయిల్‌ ద్వారా సమర్పించడానికి మెయిల్‌ ఐడిలు ప్రకటించారు. అంతే కాకుండా ప్రజలు తమ ఫిర్యాదుల‌ను నేరుగా సంబంధిత అధికారుల‌కు వారి వారి కార్యాల‌యాల‌లో ఏర్పాటు చేసిన డ్రాప్‌ బాక్స్‌లో సమర్పించ వచ్చని, ఫోన్‌ నంబర్లలో సంబంధిత జిల్లా అధికారులు ప్రతి సోమవారం ఉదయం 10:30 నుండి మద్యాహ్నం 2 గంటల‌ వరకు అందుబాటులో ఉంటారని, ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు శీఘ్ర గతిన వాటి పరిష్కారానికి చొరవ తీసుకుంటారని జిల్లా కలెక్టర్‌ తెలిపారు.

కావున ప్రజలు తమ తమ ఫిర్యాదుల‌ను పైన పేర్కొన్న అధికారుల‌ కార్యాల‌యాల‌లో ఏర్పాటు చేసిన డ్రాప్‌ బాక్స్‌లో నేరుగా, ల్యాండ్‌ లైన్‌ ద్వారా, వాట్సప్‌ ద్వారా లేదా ఈ- మెయిల్‌ ద్వారా సమర్పించాల‌ని జిల్లా కలెక్టర్‌ ప్రజల‌కు విజ్ఞప్తి చేసారు.

Check Also

వృత్తి నిబద్ధతకు మారుపేరు వందన కుమారి

నిజామాబాద్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వృత్తి నిబద్ధతకు మారుపేరు హిందీ పండిట్‌ వందన కుమారి ...

Comment on the article