Breaking News

ఆఫీసర్‌ లైఫ్‌, పర్సనల్‌ లైఫ్‌ రెండు హ్యాండిల్‌ చేయాలి

నిజామాబాద్‌, జూలై 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆఫీసర్లు పాజిటివ్‌ మెంటాలిటీతో ప్రజల‌కు సేవ చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. నాలుగు వారాల‌ పాటు జిల్లాలో క్షేత్రస్థాయి శిక్షణ కొరకు వచ్చిన 21 మంది నాయబ్‌ తహసిల్దార్లతో జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి కలెక్టరేట్‌ ప్రగతిభవన్‌ సమావేశం మందిరంలో సమావేశమయ్యారు.

వివిధ జిల్లాల‌ నుండి శిక్షణ కొరకు వచ్చిన నాయబ్ త‌హ‌సిల్దార్లతో మాట్లాడుతూ ఆఫీసర్లకు పాజిటివ్‌ మెంటాలిటీ లేకుంటే అతను పనిచేసే ఏరియా అంతా ఇబ్బంది పడుతుందని, అధికారిగా కరెక్ట్‌గా పని చేస్తే అందరూ సమిష్టిగా ముందుకు వెళ్తారని, మనం ఉన్న పొజిషన్‌ మన ఒక్కరి కోసం కాదు, పనిచేస్తున్న ఏరియా మొత్తానికని, మనం తీసుకున్న ప్రతి నిర్ణయం అందరికీ ఉపయోగ పడే విధంగా ఉండాల‌న్నారు.

ఎదుటివారిని బాధపెట్టే విధంగా ఎప్పుడూ ఉండకూడదన్నారు. ప్రజల‌కు సహాయంచేసే టైంలో మన సీటు మనం కాపాడుకోవాల‌ని, రూల్‌ ప్రకారం పని చేయాల‌న్నారు. సర్వీసులో పర్సనల్‌ లైఫ్‌ బాగుంటుందని, కొంతమంది మేనేజ్‌ చేయకపోవడం, పర్సనల్‌ లైఫ్‌ బ్యాలెన్స్‌ చేయకపోవడం జరుగుతుంటాయని, ఆఫీసర్‌ లైఫ్‌, పర్సనల్‌ లైఫ్‌ రెండు హ్యాండిల్‌ చేయాల‌ని, రెండూ బాగుండే విధంగా బ్యాలెన్స్‌ చేయాల‌న్నారు.

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో ఏవిన్యూ ప్లాంటేషన్‌ పనులు పూర్తి కావస్తున్నాయని, గ్రామాలో పల్లె ప్రగతి ఏ విధంగా జరుగుతున్నదో పరిశీలించాల‌న్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

వృత్తి నిబద్ధతకు మారుపేరు వందన కుమారి

నిజామాబాద్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వృత్తి నిబద్ధతకు మారుపేరు హిందీ పండిట్‌ వందన కుమారి ...

Comment on the article