Breaking News

ఘనంగా పి.వి. శతజయంతి ఉత్సవాలు

కామారెడ్డి, జూలై 24

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పి. వి నర్సింహారావు శత జయంతి ఉత్సవాల‌ను ఘనంగా నిర్వహించినట్టు డిసిసి అధ్యక్షుడు కైలాస్‌ శ్రీనివాస్‌ రావు అన్నారు. మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ఆదేశాల‌ మేరకు శతజయంతి కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.

మాజీ ప్రధానమంత్రి, ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు పి వి నర్సింహారావు శత జయంతి ఉత్సవాల‌ను పురస్కరించుకుని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పి వి శత జయంతి ఉత్సవాల‌ సందర్భంగా జూమ్‌ ఆప్‌ ద్వారా కార్యక్రమంలో దాదాపు 50 మంది కార్యకర్తలు పాల్గొన్నట్టు తెలిపారు. అనంతరం స్థానిక పార్టీ కార్యాల‌యం వద్ద పి.వి చిత్రపటానికి పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు.

ఈ సందర్భంగా కైలాస్‌ శ్రీనివాస్‌ రావు మాట్లాడుతూ పివి నరసింహారావు పేద ప్రజల‌ కోసం అహర్నిశలు పని చేసిన గొప్ప నాయకుడని, అదే విధంగా భూ సంస్కరణల‌తో పేద మద్య తరగతుల‌ వారికి న్యాయం జరిగేలా కృషి చేసిన గొప్ప నాయకుడు అన్నారు. కుంటు పడిన మన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన నాయకుడు మన తెలంగాణ వ్యక్తి అవడం మనకు గర్వకారణమని ఆయన సేవల‌ను కొనియాడారు.

పి.వి.ఆశయ సాధన కోసం యువత కృషి చేయాల‌ని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు పండ్ల రాజు, ల‌క్కపత్ని గంగాధర్‌ ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్‌ కుమార్‌, యువజన కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు శ్రీను, కౌన్సిల‌ర్లు చాట్ల రాజేశ్వర్‌, అంజద్‌, షేరు, రవీందర్‌ గౌడ్‌, పాత శివకృష్ణ మూర్తి, మాజీ కౌన్సిల‌ర్లు జొన్నల‌ నర్సింలు, బట్టు మోహన్‌, జమీల్‌, కిరణ్‌, సర్వర్‌, జమీల్‌ జమ్పాుర్‌ సుధాకర్‌, మధు తదితరులు పాల్గొన్నారు.

Check Also

5 నుంచి 14 వరకు లాక్‌డౌన్‌

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నానాటికీ విజృంభిస్తున్నందున ...

Comment on the article